భవానీపురం, మార్చి 27 : బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) జాయింట్ సెక్రటరీగా నగరానికి చెందిన శా ప్ మాజీ చైర్మన్ డాక్టర్ పి. అంక మ్మ చౌదరి ఎన్నికయ్యారు. శనివారం రాత్రి గౌహతిలో జరిగిన బాయ్ వార్షిక జనరల్ బాడీ స మావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎ న్నుకొన్నారు. సౌతిండియా నుం చి ఎన్నికైన ఏకైక జాయింట్ సెక్రటరీ అంకమ్మ చౌదరి కావడం వి శేషం. రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్న అంకమ్మ గతంలోను ఈ పదవి చేపట్టారు. 40ఏళ్ల నుంచి బ్యాడ్మింటన్‌కు సేవ చేస్తున్న అంకమ్మకు మరోసారి పదవి దక్కడంపై ఏపీబీఏ అధ్యక్షుడు, ఎంపీ టీజీ వెంకటేష్, నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభినందించారు.