క్యాన్సర్ రోగులకు సాయమందించిన వారికి థ్యాంక్స్ చెప్పిన బాల‌య్య

May 7 2021 @ 11:46AM

కొవిడ్ సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు కనీస వైద్య సదుపాయం అందక ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో సెలబ్రిటీలు, ఎన్జీఓలు ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు మద్దతుని అందిస్తున్నారు. ఈ క్రమంలో హిందూపురం నియోజక వర్గంలోని క్యాన్సర్ రోగులకు, పేదలకు ముప్పై లక్షల రూపాయల విలువైన రోగ నిరోధక మందులను అర్షి స్కిన్, హెయిర్ క్లినిక్ యాజమాన్యం అందించారు. అర్షి స్కిన్ హెయిర్ క్లినిక్ యాజ‌మాన్యం అందించిన ఈ సాయంపై హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించి వారికి కృత‌జ్ఞ‌తలు తెలిపారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.