Advertisement

హిందూపూర్ కోవిడ్ సెంటర్‌కు బాలయ్య రూ. 55లక్షల విరాళం

Aug 23 2020 @ 22:27PM

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధికి నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో ఆయన ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. ‘సీసీసీ మనకోసం’కు భారీగా విరాళం ఇవ్వడమే కాకుండా, సినిమా ఇండస్ట్రీలోని చాలా మందికి ఈ కోవిడ్ సమయంలో ముందు జాగ్రత్తగా తీసుకోవలసిన మందులను.. మెడికల్ కిట్స్ రూపంలో అందించారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధిగా రూ. 50 లక్షల చొప్పున రూ. కోటి రూపాయల భారీ విరాళం అందించారు. ఇక తన నియోజకవర్గం విషయంలో కూడా బాలయ్య ఎంతో సర్వీస్ అందించారు. 


తన నియోజక వర్గంలో పీపీఈ కిట్స్ విషయంలోగానీ, మాస్క్‌ల విషయంలో కానీ, కోవిడ్ పేషెంట్స్ విషయంలో గానీ ఎప్పటికప్పుడు వైద్యులను, అలాగే ప్రభుత్వాన్ని అలెర్ట్ చేస్తున్న బాలయ్య తాజాగా తన నియోజక వర్గంలోని కోవిడ్ సెంటర్ కోసం రూ. 55 లక్షల విరాళం ప్రకటించి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. హిందూపూర్ గవర్నమెంట్ హాస్పిటల్‌లోని కోవిడ్ సెంటర్‌కు మెడిసెన్స్, పీపీఈ కిట్స్, మాస్క్స్ ఇంకా ఇతర పరికరాల నిమిత్తం ఆయన ఈ విరాళాన్ని ప్రకటించారు.

Advertisement
Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.