పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ (పీజీఐఎం ఇండియా ఎంఎఫ్) ‘పీజీఐఎం ఇండియా బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్’ పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. ఈ నెల 16న ప్రారంభమైన ఈ పథకం సబ్‌స్ర్కిప్షన్ 29న ముగుస్తుంది.
ఈ పథకం ద్వారా కనీసం రూ.500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. పీజీఐఎం ఇండియా ఎంఎఫ్ సంస్థ బ్యాలెన్స్‌డ్ ఫండ్ ప్రారంభించడం ఇదే మొదటిసారి.