బలపం పంచాయతీ గ్రామాలకు రోడ్లు వేయిస్తా

ABN , First Publish Date - 2021-10-17T06:04:24+05:30 IST

బలపం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామాలకు అంతర్గత రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎంపీపీ వంతల బాబూరావు అన్నారు.

బలపం పంచాయతీ గ్రామాలకు రోడ్లు వేయిస్తా
గిరిజనులతో మాట్లాడుతున్న ఎంపీపీ బాబూరావు


ఎంపీపీ బాబూరావు

చింతపల్లి, అక్టోబరు 16: బలపం పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామాలకు అంతర్గత రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని స్థానిక ఎంపీపీ వంతల బాబూరావు అన్నారు. శనివారం బలపం పంచాయతీ లోని బూరుగుబయలు, కుడుములు గ్రామాలను సందర్శించారు. కేవలం కాలిబాట కలిగిన రహదారిపై వాగులు, వంకలు దాటుకుంటూ ఎంపీపీ ఆ గ్రామాలను సందర్శించి స్థానికులు ఎదుర్కొటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ విలేకర్లతో మాట్లాడుతూ, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లేందుకు అంతర్గత రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. రోగులను ఆస్పత్రికి తరలించేందుకు డోలిలో తీసుకు వెళ్లాల్సి వస్తున్నదన్నారు. వర్షాలు అధికంగా కురిస్తే పొరుగు గ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు తెలియజేశారన్నారు. బలపం పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాడేరు ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పంచాయతీ, మండల పరిషత్‌ నిధులతో రహదారులు నిర్మిస్తామన్నారు. 


Updated Date - 2021-10-17T06:04:24+05:30 IST