దేవదాయ శాఖ పరిధిలోకి బాలవినాయక ఆలయం

ABN , First Publish Date - 2021-10-24T06:04:57+05:30 IST

పట్టణంలోని ఐదు రోడ్ల కూడలిలో గల బాల వినాయక ఆల యం దేవదాయ శాఖ పరిధిలోకి చేరింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

దేవదాయ శాఖ పరిధిలోకి బాలవినాయక ఆలయం
నర్సీపట్నంలోని ఐదు రోడ్లు కూడలిలో గల బాల వినాయకుని ఆలయం

నర్సీపట్నం, అక్టోబరు 23 : పట్టణంలోని ఐదు రోడ్ల కూడలిలో గల బాల వినాయక ఆల యం దేవదాయ శాఖ పరిధిలోకి చేరింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు ప్రతులను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ పత్రికలకు విడుదల చేశారు. త్వరలో ఆలయ కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఆలయాన్ని 1968లో దాతల సహకారంతో నిర్మించారు. నాటి నుంచి స్థానికంగా ఉన్న పెద్దలు ఆలయ కమిటీలు వేసుకొని, హుండీ ఆదాయంలో అర్చకునికి జీతం, విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తూ ఆలయంలో ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. ఏటా వినాయక చవితి, సంక్రాంతితో పాటు తీర్థ మహోత్సవాలను  దాతల విరాలతో జరుపుతుండేవారు. మునిసిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న కల్యాణ మండపం ఒక్కటే ఈ ఆలయానికి ఉన్న ఆస్తి. ప్రస్తుతం ఉన్న ఆలయ కమిటీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఎండోమెంట్‌లోకి తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-10-24T06:04:57+05:30 IST