ప్రకాశం : కొత్త మంత్రి వర్గం ఏర్పాటు అనేది సీఎం జగన్ నిర్ణయమని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జగన్ ఎవరిని పెడితే వాళ్లే మంత్రిగా ఉంటారన్నారు. ఆరు నెలల క్రితమే మంత్రి వర్గం మారుతుందని తాను చెప్పానన్నారు. ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసివేయాలో సీఎం ఇష్టమన్నారు. ఐదేళ్లు పరిపాలించడానికి తమకు ప్రజలు అవకాశం ఇచ్చారని బాలినేని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు రమ్మని చెప్పడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 20 సీట్లు చంద్రబాబు గెలిచాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ 20 సీట్లు గెలుచుకుంటే చాలని... గత ప్రభుత్వంలో జగన్ అసెంబ్లీని బాయికట్ చేసి వెళ్లి సీఎం అయ్యారన్నారు. చంద్రబాబు కూడా అసెంబ్లీని బాయికట్ చేసి వెళ్లి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నాడని బాలినేని పేర్కొన్నారు.