
హైదరాబాద్: ‘అగ్నిపథ్’ ఆందోళనలకు కేంద్రమే కారణమని ఎమ్మెల్యే బాల్క సుమన్ (MLA Balka Suman) ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్నిపథ్ స్కీమ్‌ను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న రిక్రూట్‌మెంట్ విధానాన్ని కొనసాగించాలన్నారు. నిన్నటి ఘటనలకు టీఆర్ఎస్ (TRS) కారణమైతే.. వారణాసి, కాన్పూర్‌లో ఘటనలకు కూడా టీఆర్ఎస్సే కారణమా? అని ప్రశ్నించారు. బీజేపీ తూటాలకు తెలంగాణ బిడ్డ బలయ్యాడని బాల్క సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై.. ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
ఇవి కూడా చదవండి