బల్లకట్టు.. దర్జాగా

ABN , First Publish Date - 2021-11-01T05:42:54+05:30 IST

అనుమతులు లేవు.. అయినా దర్జాగా కృష్ణా నది పై యథేచ్ఛగా బల్ల కట్టు నిర్వహణ. ఎక్కడో మారు ప్రాంతం కాదు.. మండలం లోని గోవిందాపురం సమీపం నుంచి సర్వీసులు నిర్వహిస్తున్నారు.

బల్లకట్టు.. దర్జాగా
గోవిందాపురం వద్ద బల్లకట్టులోకి ఎక్కిస్తున్న వాహనాలు

అనుమతులు లేకుండా నిర్వాహణ 

గోవిందాపురం వద్ద కృష్ణానదిపై సర్వీసు

నిబంధనలకు విరుద్దంగా చార్జీల వసూళ్లు 


మాచవరం, అక్టోబరు 31: అనుమతులు లేవు.. అయినా దర్జాగా కృష్ణా నది పై యథేచ్ఛగా బల్ల కట్టు నిర్వహణ. ఎక్కడో మారు ప్రాంతం కాదు.. మండలం లోని గోవిందాపురం సమీపం నుంచి సర్వీసులు నిర్వహిస్తున్నారు. ఇదేదో రహస్యంగా జరిగేది కాదు. అయినా ఎం దుకనో అధికా రులు కనీసం పట్టించు కోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ప్రయాణికులు మాత్రం తొం దరగా గమ్య స్థానానికి చేరుకుంటామన్న యావలో బల్లకట్టుకు అనుమతులు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఎక్కేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో పాటు.. నదిలో నీరు ఎ క్కువగా ఉంది. అయినా భయం లేకుం డా దర్జాగా బల్లకట్టు సర్వీసు కొనసాగి స్తున్నారు. గోవిందాపురం సమీపంలోని కృష్ణానదిపై బల్లకట్టును తెలంగాణ నుం చి ఆంధ్రావైపు, ఆంధ్రా నుంచి తెలంగా ణ వైపు సర్వీసు నిర్వహిస్తున్నారు. తెలం గాణ వైపు నుంచి ఇటు వైపు రాకకు అ నుమతి ఉంది. ఈ ప్రకా రం ప్రయాణికు లను, వాహనాలను తీసు కువచ్చి గోవిందా పురం వద్ద వదిలి ఖాళీగా బల్లకట్లు వెళ్లాలి. అయితే అందుకు విరుద్ధంగా ఇటు నుంచి ప్రయాణికులను, వాహనాల తో బల్లకట్టును తీసుకెళ్తున్నారు. అందుకు ఎటువంటి అనుమతులు లేవు. అయినా గోవిందాపురం ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పా టు చేసి బల్లకట్టు సర్వీసు నిర్వహిస్తు న్నారు. దీనినిబట్టి నిర్వాహకులకు అధి కారుల అండ కూడా ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ప్రయాణికులు, వాహనదారుల నుంచి అధి క చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక ప్రయాణికు డి నుంచి రూ.50, ద్వి చక్రవాహనానికి రూ.100, కారు, లారీ అయితే రూ.500 నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. బల్లకట్టు ద్వారా తెలంగాణ నుంచి మద్యం కూడా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బ్యాక్‌వాటర్‌ తో నిండుగా ఉన్న కృష్ణానదిలో బల్లకట్టు రాకపోకలు సాగిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమి టో ఎవరూ పట్టించుకోవడంలేదు. అను మతుల గురించి పట్టించుకోని నిర్వాహ కులు కనీసం బల్లకట్టులో ఉండాల్సిన సేఫ్టీ పరికరాలు కూడా ఏర్పాటు చేయలే దని ప్రయాణికులు తెలియజేస్తున్నారు. 

 ఎలాంటి ఉత్తర్వులు లేవు

ఆంధ్రా నుంచి బల్లకట్టు నిర్వాహణకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు కానీ, అనుమతులు కానీ అందలేదు. తాము కూడా ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. బల్లకట్టు నిర్వాహణను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

-  రాజగోపాల్‌, ఎంపీడీవో 



Updated Date - 2021-11-01T05:42:54+05:30 IST