బళ్లారి మేయర్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

ABN , First Publish Date - 2021-11-17T18:23:31+05:30 IST

మరో 24 గంటల్లో బళ్లారి మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు కాంగ్రెస్‌ నుంచి మేయర్‌ పదవి ఆశించే వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మేయర్‌ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నలుగురితో

బళ్లారి మేయర్‌ ఎన్నిక మళ్లీ వాయిదా

             - ఎమ్మెల్సీ ఎన్నికల కారణం అంటున్న అధికారులు 

             - కార్పొరేటర్ల ఆశలపై నీళ్లు


బళ్లారి(Bengaluru): మరో 24 గంటల్లో బళ్లారి మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు కాంగ్రెస్‌ నుంచి మేయర్‌ పదవి ఆశించే వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మేయర్‌ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ నలుగురితో కూడిన కమిటీని నియమించింది. వారి రాక సందర్భంగా బళ్లారి కాంగ్రెస్‌ నాయకులు ఏర్పాట్లు చేశారు. కార్పొరేటర్ల ఆశలపై ఎన్నికల కమిషన్‌ నీళ్లు చల్లింది. ఉన్నట్టుండి మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికను రద్దు చేస్తూ జీవోను జారీ చేసింది. మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయింది. దీంతో మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికలు జరపడం కుదరదు. సిబ్బంది కొరత ఏర్పడిందని కారణం చూపి వాయిదా వేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఎప్పడు అనేది తేదీ ఖరారు చేయకుండా వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. బళ్లారి మేయర్‌, ఉపమేయర్‌ ఎన్నికల ఆగిపోవడంతో అంతా నిరాశచెందారు. 

Updated Date - 2021-11-17T18:23:31+05:30 IST