Ballary: నీ.. దేశభక్తికి వందనాలు తల్లీ..

ABN , First Publish Date - 2022-08-14T18:02:21+05:30 IST

వాడిన ముఖం.. చింపిరి జుట్టు... చంకలో ఒక బ్యాగు.. అయినా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి వదలకుండా అలానే పట్టుకుంది.. మా తుజే..

Ballary: నీ.. దేశభక్తికి వందనాలు తల్లీ..

బళ్లారి(బెంగళూరు), ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): వాడిన ముఖం.. చింపిరి జుట్టు... చంకలో ఒక బ్యాగు.. అయినా త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి వదలకుండా అలానే పట్టుకుంది.. మా తుజే.. సలాం.. అనే దేశభక్తి పాటకు డాన్స్‌ కూడా చేసింది. శనివారం నగరంలోని మోతి సర్కిల్(Moti Circle)లో జరిగిన భారీ పతాక ప్రారంభం కార్యక్రమంలో ఈ సన్నివేశం ఆవిష్కరించింది. కార్యక్రమంలో ప్రదర్శించబడిన మా.. తుజే.. సలాం పాటకు.. మతిస్థిమితం లేని యువతి వాడిన ముఖం త్రివర్ణ పతాకం పట్టుకుని నృత్యం చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఆమే దేశభక్తికి అందరూ శభాష్‌ తల్లీ అని ఆ మతిస్థిమితం లేని యువతిని సభ్యసమాజం మెచ్చుకోగా.. చేతిలో ఉండే త్రివర్ణపతాకం గర్వించింది..! 

Updated Date - 2022-08-14T18:02:21+05:30 IST