ఉక్రెయిన్ ప్రముఖ డ్యాన్సర్.. బ్యాలెట్ స్టార్ ఆర్టియోమ్ దట్సిషిన్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-03-19T21:47:41+05:30 IST

ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ ఆర్టియోమ్ దట్సిషిన్ (Artyom Datsishin) ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ

ఉక్రెయిన్ ప్రముఖ డ్యాన్సర్.. బ్యాలెట్ స్టార్ ఆర్టియోమ్ దట్సిషిన్ కన్నుమూత

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ ఆర్టియోమ్ దట్సిషిన్ (Artyom Datsishin) ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉక్రెయిన్-రష్యా మధ్య గత నెల చివరి వారంలో ప్రారంభమైన యుద్ధం.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు పలు దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ అవి ఫలప్రదం కాలేదు. దీంతో రష్యా బాంబుల వర్షం కురిపిస్తుండగా.. ఉక్రెయిన్ అదే స్థాయిలో ప్రతిఘటిస్తోంది. కాగా.. రష్యా జరిపిన దాడిలో ఉక్రెయిన్‌ బ్యాలెట్ స్టార్ ఆర్టియోమ్ దట్సిషిన్ మూడు వారాల క్రితం తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం ప్రాణాలు విడిచారు. 43 ఏళ్ల దట్సిషిన్ .. ఉక్రెయిన్ నేషనల్ ఒపెరాలో కీలక డాన్సర్‌గా ఉన్నారు. స్వాన్ లేక్, ది నట్‌క్రేకర్, స్లీపింగ్ బ్యూటీ, గిసెల్లే, రోమియో అండ్ జూలియట్‌లో కీలక పాత్రలు పోషించారు. ఐరోపా, అమెరికాలో పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితమే ఉక్రెయిన్ రంగస్థల, సినీ నటి ఒక్సానా ష్వెట్స్ కన్నుమూసిన విషయం తెలిసిందే.




Updated Date - 2022-03-19T21:47:41+05:30 IST