బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-02-28T04:28:30+05:30 IST

శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేయాలని, ఆ వివరాలను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ డిప్యూటీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌

బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేయాలి
హాజరైన అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి ఎన్‌ మధుసూదన్‌

 

-------------------

వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ డిప్యూటీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎం సత్యవాణి

ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27: శాసనమండలి ఎన్నికల పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేయాలని, ఆ వివరాలను వెంటనే అందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ డిప్యూటీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎం. సత్యవాణి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ జిల్లాల వారీగా బాలెట్‌ బాక్సుల వివరాలను అడిగితెలుసుకున్నారు. డిప్యూటీ సీఈవో సత్యవాణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకుని మార్చి 14న జరగనున్న పోలింగ్‌కు ఆయా జిల్లాల ఓటర్ల ఆధారంగా జంబో బ్యాలెట్‌ బాక్సులను సిద్ధంగా ఉంచాలని, ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారుల వద్ద ఉన్న బాలెట్‌ బాక్సుల వివరాలను తక్షమనే అందించాలని ఆమె సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతి పొందిన వెంటనే బ్యాలెట్‌ బాక్సుల వినియోగంపై ఆదేశాలను ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని బ్యాలెట్‌ బాక్సులను శుభ్రపరించి, ఆయిలింగ్‌ పెయింటింగ్‌ చేయాలని సూచించారు. ఉన్న దానికంటే అదనంగా అవసరమైన రిక్విజేషన్‌ను తక్షణమే అందించాలన్నారు. అదనపు కలెక్టర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి ఎన్‌ మధుసూదన్‌ జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉన్న బ్యాలెట్‌ బాక్సుల వివరాలను డిప్యూటీ సీఈవోకు వివరించారు. జిల్లాలో 87,172 మంది పట్టభద్రుల ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు జిల్లాలో 127 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనికి గాను 538 బ్యాలెట్‌ బాక్సులు అవసరం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 878 పెద్దవి, 833 మీడియం బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో బ్యాలెట్‌ బాక్సుల నోడల్‌ అధికారి ప్రభాకర్‌రావు, కలెక్టరేట్‌ ఏవో మదన్‌గోపాల్‌, ఎన్నికల డీటీ ఆర్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T04:28:30+05:30 IST