బల్మూరి వెంకట్‌ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-18T20:47:35+05:30 IST

జూబ్లీహిల్స్‌లో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నేత బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసేందుకు జూబ్లీహిల్స్‌కు బల్మూరి వెంకట్‌ వచ్చారు.

బల్మూరి వెంకట్‌ అరెస్ట్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) నేత బల్మూరి వెంకట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కలిసేందుకు జూబ్లీహిల్స్‌కు బల్మూరి వెంకట్‌ వచ్చారు. జగ్గారెడ్డిని కలవడానికి మాత్రమే వచ్చానని, ఎలాంటి కార్యక్రమం చేయడానికి రాలేదని పోలీసులకు వెంకట్ ఎంత చెప్పినా వినకుండా అరెస్ట్ చేశారు. వెంకట్‌ను అరెస్ట్ చేయకుండా ఆపడానికి జగ్గారెడ్డి ప్రయత్నించారు. బల్మూరి వెంకట్‌ను గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. పోలీసుల తీరుపై జగ్గారెడ్డి, వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకట్‌ కోసం జగ్గారెడ్డి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

Updated Date - 2022-06-18T20:47:35+05:30 IST