బల్మూరి వెంకట్‌ అరెస్టు!

ABN , First Publish Date - 2022-06-30T10:44:26+05:30 IST

చిన్నకోడూరు/తొగుట, జూన్‌ 29: సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థినులను

బల్మూరి వెంకట్‌ అరెస్టు!

అస్వస్థకు గురికావడంతో యశోదకు తరలింపు 

చిన్నకోడూరు/తొగుట, జూన్‌ 29: సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ఇటీవల కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. వెంకట్‌ను బలవంతంగా ఆయన వాహనంలో నుంచి దించి అరెస్టు చేసి తొగుట పోలీసుస్టేషనుకు తరలించారు. అయితే వెంకట్‌ అస్వస్థకు గురికావడంతో గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. వెంకట్‌ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నకోడూరు పోలీసు స్టేషను ఎదుట సిద్దిపేట-ఇల్లంతకుంట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాగా వెంకట్‌ మెడ భాగంలో గాయం అయినట్టు తెలుస్తోంది. వెంకట్‌ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి  పరామర్శించారు. పోలీసులు ప్రవర్తించిన తీరును జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. కాగా వెంకట్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండి ంచారు. వెంకట్‌ అరె్‌స్టపై సిద్దిపేట కమిషనర్‌తో రేవంత్‌ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అస్వస్థతకు గురైనవారిని పరామర్శించేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకుడిని అడ్డుకోవడం టీఆర్‌ఎస్‌ పాలకుల పాశవిక చర్య అని రేవంత్‌ మండిపడ్డారు. 

జీవితం విలువైనది.. అవాంఛనీయ నిర్ణయాలొద్దు : ఇంటర్‌ విద్యార్థులకు రేవంత్‌ సూచన 

జీవితం చాలా విలువైనదని, దాన్ని అర్థం చేసుకుని ఎలాంటి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవద్దని ఇంటర్‌ విద్యార్థులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పేపర్‌ రీ వాల్యూయేషన్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫీజులను ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2022-06-30T10:44:26+05:30 IST