అలరించిన చిన్నారుల ప్రదర్శనలు
అంబరాన్ని తాకిన సంబరాలు
ఆకట్టుకున్న పిల్లల ప్రదర్శనలు
ముగిసిన వేడుకలు
ఏలూరురూరల్, మార్చి 27 : హేలాపురి బాలోత్సవం పిల్లల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగాయి. రెండో రోజు సాంస్కృతిక, అకడమిక్ పోటీలను నిర్వహించారు. రెండు రోజులుగా జరిగిన చిన్నారుల సంబరాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. స్థానిక అమీనాపేట పోలీసు స్కూలు పిల్లల సందడితో, ప్రముఖుల రాకతో బాలోత్సవం బ్రహ్మోత్సవంలా జరిగింది. సాంస్కృతిక, అకడమిక్ పోటీలు ఆకట్టుకు న్నాయి. జానపద నృత్యాలు, బాల బాలికల కోలాటాలు, మట్టి బొమ్మల తయారీ, చిత్రలేఖనం, వీధి నాటికలు, భరతనాట్యం వంటి పోటీల్లో విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటారు. ముఖ్య అతిఽథిగా దీపక్ నెక్స్‌జెన్ ఫిష్ ఫీడ్స్ లిమిటెడ్ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం, పారిశ్రామిక వేత్త శివశంకర్ లునాని, తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామంజనేయ చౌదరి, ఎకో బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. నేటి కార్పొరేట్ విద్యా విధానంతో ర్యాంకుల వేటలో చదువు తప్ప ఇతర రంగాల్లో రాణించడానికి క్రీడలు, సాంస్కృతిక అంశాలపై దృష్టి పెట్టే పరిస్థితి కనిపించడం లేదన్నారు. సాయంత్రం పిల్లల సంబరాలు ఘనంగా ముగిశాయి. అభ్యుదయ వాది మంతెన సీతారాం ముఖ్య అతిఽథిగా విచ్చేసి సాంస్కృతిక, అకడమిక్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. మంచి సంస్కృతిని అందరూ ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వరరావు, ఎల్.వెంకటేశ్వరరావు, గుడిపాటి నరసింహారావు, కె.శ్రీనివాస్, నిర్వాహకులు ఎం.అజయ్‌బాబు, జె.సత్యనారాయణరాజు, మజ్జి కాంతారావు, షేక్ ముస్తఫా ఆలీ, కె.సత్య నారాయణ, కనకదుర్గ, సుధారాణి, మాలతి, సుభాషిణి పాల్గొన్నారు.
