లక్ష్యంపై దృష్టిపెట్టండి

Published: Mon, 28 Mar 2022 00:34:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
లక్ష్యంపై దృష్టిపెట్టండిమట్టితో బొమ్మలు చేస్తున్న చిన్నారులు

బాలోత్సవ్‌ ముగింపు సభలో కమిషనర్‌ రంజిత్‌ బాషా

మొగల్రాజపురం, మార్చి 26 : విద్యార్థులు నిరంతరం ఏదో ఒకటి తెలుసుకుంటూ ఉండాలని, లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రంజిత్‌ బాషా పిలుపునిచ్చారు. పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతున్న అమరావతి బాలోత్సవ్‌ ముగింపు కార్యక్రమం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కమిషనర్‌ రంజిత్‌ బాషా మాట్లాడుతూ తాను ఆరేళ్ల వయసు నుంచే పాఠశాలలో జరిగే అన్ని పోటీల్లో పాల్గొనేవాడినని, ముఖ్యంగా క్విజ్‌ పోటీలకు ఆసక్తి చూపించేవాడినన్నారు. అదే ఐఏఎస్‌లో తనకు ఆరో ర్యాంకును తెచ్చిపెట్టిందని చెప్పారు. చదువుతో పాటు ఏదో ఒక అంశంపై ఇష్టాన్ని పెంచుకోవాలని సూచించారు. అన్నింటికంటే వ్యక్తిగత క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావం ఉండాలన్నారు. నాసాలో శిక్షణ పొందుతున్న జాహ్నవి మాట్లాడుతూ తాను మార్కుల కోసం చదవలేదని, కానీ తనకు అంతరిక్షంపై ఉన్న ఆసక్తితో నెట్‌లో చూసి పరిజ్ఞానాన్ని పెంచుకున్నానని చెప్పారు. కాగా, జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన 12 వేదికలపై ప్రతిభను చాటారు. కోలాటాలు, నాటికలు, శాస్త్రీయ నృత్యాలు, దేశభక్తి గీతాలు, ఏకపాత్రాభియనం, క్లాసికల్‌ షో, వ్యాసరచన, కథారచన, స్పెల్‌బీ, మెమరీ టెస్ట్‌, మట్టితో బొమ్మలు చేయడం, సైన్స్‌ ఎగ్జిబిషన్‌, వక్తృత్వం, పద్యం-భావం, వార్తారచన వంటి విభాగాల్లో సీనియర్స్‌, జూనియర్స్‌ వారీగా పోటీలు నిర్వహించారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమానికి బాలోత్సవం అధ్యక్షుడు రామరాజు అధ్యక్షత వహించగా, కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, బాలోత్సవ్‌ కొత్తగూడెం అధ్యక్షుడు వాసిరెడ్డి రమేశ్‌బాబు, పిల్లల పండుగ కాకినాడ కన్వీనర్‌ జగన్నాథరావు, తెలుగు భాషా ఉద్యమకారులు గణేశ్‌, అమరావతి బాలోత్సవ్‌ గౌరవాధ్యక్షుడు చలువాది మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి కొండలరావు, జనశిక్షణా సంస్థాన్‌ చైర్మన్‌ విద్యాఖన్నా, తరుణీ తరంగాలు కార్యదర్శి జ్యోత్స్న, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 

లక్ష్యంపై దృష్టిపెట్టండిమాట్లాడుతున్న మున్సిపల్‌ కమిషనర్‌ రంజిత్‌ బాషా


లక్ష్యంపై దృష్టిపెట్టండిఆకట్టుకున్న సాంస్కృతిక నృత్య ప్రదర్శన


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.