అక్కడి ప్రజలకు అదే రైలు!

ABN , First Publish Date - 2021-05-06T05:30:00+05:30 IST

ప్యాసింజర్‌ రైలు చూసే ఉంటారు. ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కే ఉంటారు. కానీ బ్యాంబూ రైలు గురించి విన్నారా! ఆ విశేషాలు ఇవి....

అక్కడి ప్రజలకు అదే రైలు!

  • ప్యాసింజర్‌ రైలు చూసే ఉంటారు. ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కే ఉంటారు. కానీ బ్యాంబూ రైలు గురించి విన్నారా! ఆ విశేషాలు ఇవి....


  1. బ్యాంబూ ట్రెయిన్‌ అంటే రైల్వే శాఖ నడిపే రైలు కాదు. గ్రామస్తులు సొంతంగా కర్రతో తయారుచేసుకున్న ట్రాలీ. ఇది రైలు పట్టాలపైన దూసుకెళుతుంది. అందుకే వీటికి బ్యాంబూ ట్రెయిన్‌ అని పేరు.
  2. కాంబోడియాలోని బట్టంబ్యాంగ్‌ అనే ప్రాంతంలో ఈ తరహా రైలు ప్రయాణం కనిపిస్తుంది. అక్కడ రైళ్లు సమయానికి రావడం చాలా అరుదు. అందుకే స్థానికులు ప్రయాణం కోసం ఈ బ్యాంబూ ట్రెయిన్‌లను ఆశ్రయిస్తుంటారు.
  3. ఈ ట్రాలీలను అక్కడ నొర్రీస్‌ అని పిలుస్తారు. రైలుకు ఉండే చక్రాలే ఈ ట్రాలీకీ ఉంటాయి. కాకపోతే కాస్త చిన్న సైజులో ఉంటాయి. ఆ చక్రాలపైన కర్రతో చేసిన ట్రాలీ పెడతారు. చిన్న ఇంజన్‌ ఉంటుంది. 
  4. ఎదురుగా రైలు వచ్చేది చూసుకుంటూ వెళతారు. ఒకవేళ అదే మార్గంలో రైలు వస్తున్నట్లయితే ట్రాలీ, వీల్స్‌ తీసి పక్కన పెడతారు. రైలు వెళ్లిపోయాక మళ్లీ అమర్చుకుని ప్రయాణం కొనసాగిస్తారు.  

Updated Date - 2021-05-06T05:30:00+05:30 IST