Mayawati: ఆర్ఎస్‌ఎస్‌ను బుజ్జగించేందుకే పీఎఫ్ఐ‌పై నిషేధం

ABN , First Publish Date - 2022-09-30T21:37:46+05:30 IST

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్రం నిషేధాన్ని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ..

Mayawati: ఆర్ఎస్‌ఎస్‌ను బుజ్జగించేందుకే పీఎఫ్ఐ‌పై నిషేధం

న్యూఢిల్లీ: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై కేంద్రం నిషేధాన్ని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి  మాయావతి (Mayawati) తప్పుపట్టారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ స్వార్థంతోనే (political selfishness) పీఎఫ్ఐని బ్యాన్ చేశారని, ఆర్ఎస్ఎస్‌ (RSS)ను బుజ్జగించే ప్రయత్నం చేశారని అన్నారు.


''పీఎఫ్‌ను లక్ష్యంగా చేసుకుని గతంలో అనేక ప్రయత్నాలు చేసిన కేంద్రం ఎట్టకేలకు పీఎఫ్ఐతో పాటు 8 అనుబంధ సంస్థలను నిషేధించింది. ఎన్నికలకు ముందు ఈ బ్యాన్ విధించారు. రాజకీయ స్వార్థం, ఆర్ఎస్‌ఎస్‌ను స్వాంతన పరచే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది'' అని మాయావతి ఒక ట్వీ ట్‌లో పేర్కొన్నారు. ఆ కారణంగానే విపక్షాలు సైతం పీఎఫ్ఐ దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకారి అయితే, ఆర్ఎస్ఎస్‌ కూడా అంతేనని, దానిని కూడా బ్యాన్  చేయాలని డిమాండ్ చేస్తున్నాయని అన్నారు.


అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్‌ వంటి సంస్థలతో పలు హింసాత్మక సంఘటనల్లో పీఎఫ్ఐ ప్రమేయం ఉందనే కారణంగా ఆ సంస్థతో  పాటు దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం గత బుధవారంనాడు నిషేధం విధించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధం విధించిన సంస్థల్లో రెబర్ ఇండియా ఫౌండేషన్, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, నేషనల్ ఉమన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రెహబ్ ఫౌండేషన్- కేరళ సైతం ఉన్నాయి. పీఎఫ్ఐతో సంబంధాలున్న 150 మందికి పైగా వ్యక్తులను దేశవ్యాప్తంగా జరిపిన రెయిడ్స్‌లో అరెస్టు చేశారు. సుమారు డజనుకు పైగా ఆస్తులను స్వాధీనం  చేసుకున్నారు.

Updated Date - 2022-09-30T21:37:46+05:30 IST