అరటికాయ బజ్జీ

ABN , First Publish Date - 2020-06-11T17:21:35+05:30 IST

పచ్చి అరటికాయ - 1, ఉల్లిపాయ మీడియం సైజ్‌ - 1, పచ్చిమిరపకాయలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - టేబుల్‌ స్పూను, కారం - చిటికెడు, పసుపు

అరటికాయ బజ్జీ

కావలసినవి: పచ్చి అరటికాయ - 1, ఉల్లిపాయ మీడియం సైజ్‌ - 1, పచ్చిమిరపకాయలు - 2, అల్లం వెల్లుల్లి పేస్టు - టేబుల్‌ స్పూను, కారం - చిటికెడు, పసుపు - చిటికెడు, బేకింగ్‌సోడా - చిటికెడు, శనగపిండి - కప్పు, బియ్యం పిండి - పావుకప్పు, వాము - పావు స్పూను, నీళ్లు - తగినన్ని, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత


తయారీ: ఉల్లిపాయ, పచ్చిమిరప, అల్లం వెల్లుల్లిని కలిపి మెత్తగా నూరి ముద్దగా చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, బేకింగ్‌ సోడా, వాము, బియ్యంపిండి, శనగపిండి... వీటన్నింటినీ ఒక గిన్నెలో ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ జావగా, గట్టిగా లేకుండా మధ్యస్థంగా ఉండాలి. అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కట్‌ చేసి నీళ్లలో నానబెట్టాలి. పావుగంట తరువాత బయటకు తీసి నీళ్లు ఒడిసేదాక  చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. కడాయిలో నూనె పోసి, వేడి చేయాలి. ఒక్కో అరటి ముక్కను తీసుకొని, పిండిలో ముంచి, కడాయిలో వేసుకొని వేగించాలి. తీసిన తరువాత టిష్యూ పేపర్‌పైన ఉంచితే నూనె పీల్చుకుంటుంది. అంతే అరటికాయ బజ్జీలు సిద్ధం. వేడివేడిగా వడ్డించండి.

Updated Date - 2020-06-11T17:21:35+05:30 IST