వంటలు

మసాలా అరటికాయ చిప్స్‌

కావలసిన పదార్థాలు: అరటికాయలు- 10, పసుపు- నాలుగు స్పూన్లు, పచ్చిమిరప కాయలు- 25 గ్రాములు, ఉప్పు- తగినంత.


తయారుచేసే విధానం: అరటికాయలు పైపెచ్చు తీసి సన్నని చక్రాలుగా కోయాలి. పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దతో పాటు అరటికాయ ముక్కల్లో పసుపు కూడా వేసి బాగా కలపాలి. ఆ తరవాత సన్నని మంట మీద వీటిని ఓ అయిదు నిమిషాలు ఉడికించి దించాలి. ఎర్రని ఎండలో ఒకదానికి ఒకటి తగలకుండా బాగా ఆరబెడితే మసాలా అరటికాయ చిప్స్‌ రెడీ. అవసరమైనప్పుడు వీటిని నూనెలో వేయించుకుంటే సరి.


Follow Us on:
`
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.