అరటిపువ్వు కొబ్బరి కూర

ABN , First Publish Date - 2021-03-25T20:55:02+05:30 IST

అరటిపువ్వు : ఒకటి (కాడలు వలచుకుని పెట్టుకోవాలి), పచ్చికొబ్బరి : ఒక చిప్ప, అల్లం ముక్క: చిన్నది, పసుపు : చిటికెడు, పోపు గింజలు : రెండు స్పూన్లు, ఉల్లిపాయలు : నాలుగు, పచ్చిమిర్చి : 6, ఉప్పు : తగినంత.

అరటిపువ్వు కొబ్బరి కూర

కావలసిన పదార్థాలు: అరటిపువ్వు : ఒకటి  (కాడలు వలచుకుని పెట్టుకోవాలి), పచ్చికొబ్బరి : ఒక చిప్ప, అల్లం ముక్క: చిన్నది, పసుపు : చిటికెడు, పోపు గింజలు : రెండు స్పూన్లు, ఉల్లిపాయలు : నాలుగు, పచ్చిమిర్చి : 6, ఉప్పు : తగినంత.


తయారు చేసే విధానం : అరటి పువ్వు కాడల్ని చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. వీటికి పసుపు వేసి నీరుపోసి ఉడికించాలి. అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, ఉప్పువేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఓ పాన్‌లో నూనె,  పోపు గింజలు వేసి చిటపటలాడాక ఉల్లి ముక్కలు దోరగా వేయించాలి. అరటి పువ్వు ముక్కలు, కొబ్బరి వేసి బాగా వేయిస్తే అరటిపువ్వు కొబ్బరి కూర రెడీ.

Updated Date - 2021-03-25T20:55:02+05:30 IST