బనానా ఐస్క్రీం
ABN , First Publish Date - 2021-04-24T17:56:10+05:30 IST
అరటిపండ్ల గుజ్జు - ఒక కప్పు, క్రీమ్ - ఒక కప్పు, పాలు - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, పంచదార - నాలుగు టేబుల్స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక టీస్పూన్, బిస్కెట్లు - కొన్ని.
కావలసినవి : అరటిపండ్ల గుజ్జు - ఒక కప్పు, క్రీమ్ - ఒక కప్పు, పాలు - అరకప్పు, కోడిగుడ్డు - ఒకటి, పంచదార - నాలుగు టేబుల్స్పూన్లు, నిమ్మరసం - ఒక టీస్పూన్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ - ఒక టీస్పూన్, బిస్కెట్లు - కొన్ని.
తయారీ విధానం: ఒక బౌల్లో అరటిపండ్ల గుజ్జు తీసుకుని అందులో నిమ్మరసం, వెనీలా, పందచార, పాలు, కోడిగుడ్డు వేసి కలపాలి. బిస్కెట్లను పొడిపొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. క్రీమ్ పలుచగా అయ్యేలా బీటర్తో కలపాలి. తరువాత అరటిపండ్ల మిశ్రమం వేయాలి. ఒక గ్లాస్ బౌల్లో క్రీమ్ మిక్సర్ను ఒక లేయర్లా వేసి, పైన కుకీస్ వేయాలి. ఫ్రిజ్లో పెట్టుకుని చల్లగా అందించాలి.