Viral News: అవునా.. ఈ అరటి పండ్లు తింటే నిజంగా చనిపోతారా.. అసలు నిజాలు ఇవీ!

ABN , First Publish Date - 2022-09-22T21:10:01+05:30 IST

అరటి పండు.. దీన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పేద ప్రజలకు అందుబాటు రేటులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ అరటి పండుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోమాలియా నుంచి భారత్‌కు పెద్ద మొత్తంలో అరటి పండ్లు దిగుమతి అయ్యాయి. వా

Viral News: అవునా.. ఈ అరటి పండ్లు తింటే నిజంగా చనిపోతారా.. అసలు నిజాలు ఇవీ!

ఇంటర్నెట్ డెస్క్: అరటి పండు.. దీన్ని చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పేద ప్రజలకు అందుబాటు రేటులో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే.. ఈ అరటి పండుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోమాలియా నుంచి భారత్‌కు పెద్ద మొత్తంలో అరటి పండ్లు దిగుమతి అయ్యాయి. వాటిని తింటే.. 12 గంటల్లో మనుషులు చనిపోతారనేది ఆ వార్త సారాంశం. నెట్టింట హల్ చల్ చేస్తోన్న ఈ భయంకరమైన వార్త ఎంత వరకూ నిజం? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? తదితర వివరాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..


నెట్టింట వైరల్ అవుతున్న వార్త..

‘హలో ఫ్రెండ్స్, కొద్ది రోజుల క్రితమే సోమాలియా(Somalia) నుంచి భారత్‌కు 500 టన్నుల అరటి పండ్లు దిగుమతి అయ్యాయి. ఈ అరటి పండ్ల(bananas)లో భయంకరమైన బ్యాక్టీరియా (హెలికోబ్యాక్టర్) ఉంది. చూడటానికి వానపాములా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉన్న అరటి పండ్లను తిన్న వెంటనే వాంతులు, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడతాం. ఆ తర్వాత 12గంటల్లోపు బ్రెయిన్ డెడ్ అయి.. మనిషి చనిపోతాడు. ఆ అరటి పండ్లకు సంబంధించిన ఈ కింది వీడియోను సాధ్యమైనంత మందికి షేర్ చేయండి’ అని పేర్కొంటూ ట్విట్టర్‌లో ఓ ట్వీట్ హల్ చల్ చేస్తోంది. గతంలో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పటికీ మరోసారి హల్ చల్ చేస్తోంది.



గంటల వ్యవధిలో హెలికోబ్యాక్టర్ (Helicobacter) నిజంగానే చంపేస్తుందా.. 

హెలికోబ్యాక్టర్‌ను జే. మార్షల్, జే రాబిన్ వారెన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు తొలుత దీన్ని కనుగొన్నారు. హెలికోబ్యాక్టర్ వల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుందని చెప్పారు. అందుకు గాను శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి కూడా లభించింది. అయితే ఎక్కడా ఈ బ్యాక్టీరియా గంటల వ్యవధిలోనే మనుషులను చంపుతుందని చెప్పలేదు. దీన్ని బట్టి హెలికోబ్యాక్టర్ గంటల వ్యవధిలో మనిషి ప్రాణాలు తీస్తుందనేది అబద్దం. పూణేకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కూడా కీలక విషయాలు వెల్లడించారు. హెలికోబ్యాక్టర్ స్టమక్ క్యాన్సర్‌కు కారణం అవుతుందని కానీ గంటల్లో మనిషిని చంపలేదని స్పష్టం చేశారు. 


అలాగే తమిళనాడులోని నేషనల్ బనానా రీసెర్చ్ సెంటర్ హెలికోబ్యాక్టర్ గరించి కీలక వ్యాఖ్యలు చేసింది. పాడైన అరటి పండ్లలో హెలికోబ్యాక్టర్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది. అలాగే వీడియోలో చూపినట్టుగా బ్యాక్టిరియా పరిమాణం.. వానపాములా అంత పెద్దగా ఉండదని వెల్లడించింది. బ్యాక్టీరియాలను కేవలం మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలమని స్పష్టం చేసింది. మరోక ముఖ్య విషయం ఏంటంటే.. సోమాలియా నుంచి భారత్ అరటి పండ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు ఎటువంటు ఎటువంటి సమాచారం లేదు.  దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. అరటి పండ్లకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతున్న వార్త ఫేక్.  




Updated Date - 2022-09-22T21:10:01+05:30 IST