అరటిపండు పాప్‌!

Published: Sun, 22 May 2022 00:09:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అరటిపండు పాప్‌!

కావలసినవి

అరటిపండు  - ఒకటి, చిక్కటి పాలు - ఒక టేబుల్‌స్పూన్‌, చియా విత్తనాలు - ఒకటేబుల్‌స్పూన్‌, పిస్తా పలుకులు - మూడు, చాక్లెట్‌ చిప్స్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, పుల్లలు - కొన్ని.


ఇలా చేయాలి...

అరటిపండు తోలు తీసి మందపాటి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

తరువాత బొమ్మలో చూపించిన విధంగా అరటిపండు ముక్కలకు పుల్లలు గుచ్చాలి.

చిక్కటి పాలు ఆ ముక్కల పైభాగంలో పోయాలి. తరువాత ఆ ప్రదేశంలో చియా విత్తనాలు వేయాలి.

చాక్లెట్‌ చిప్స్‌ను కళ్లలా అతికించాలి.

పిస్తా పలుకును నోరులా అంటించాలి.

అంతే... కోపంగా ఉన్న అరటిపండు పాప్‌ రెడీ. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.