చర్మసౌందర్యానికి అరటి!

Published: Sun, 28 Mar 2021 00:16:31 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చర్మసౌందర్యానికి అరటి!

అరటిపండులో పోషకాలు పుష్కలం. అంతేకాదు అరటిపండు చర్మసౌందర్యానికి కూడా పనికొస్తుంది. బనానా ఫేస్‌మాస్క్‌లతో చర్మ సౌందర్యం రెట్టింపవుతుంది.

మొటిమల నివారణకు: రెండు  టేబుల్‌స్పూన్ల అరటిపండు గుజ్జు, ఒక టేబుల్‌స్పూన్‌ బేకింగ్‌ సోడా, అరటేబుల్‌ స్పూను తాజానిమ్మరసం మూడింటిని గిన్నెలో వేసి మెత్తగా  పేస్టులా చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి  నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి  రెండుసార్లు చేస్తే యాక్నే సమస్య తలెత్తదు. 

ముడతలు పోవాలంటే: రెండు టేబుల్‌స్పూన్ల అరటిపండు గుజ్జు, ఒక టేబుల్‌స్పూను పెరుగు, అరటేబుల్‌స్పూను తాజా నిమ్మరసం కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లటి  నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు నాలుగుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిగారింపుకోసం..!: రెండు టేబుల్‌స్పూన్ల అరటిపండు గుజ్జు, ఒక టేబుల్‌ స్పూను తేనె రెండూ కలిపి పేస్టులా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా ఉంటుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.