విద్యార్థి సంఘాల నిరసన
ప్రొద్దుటూరు టౌన, మార్చి 5 : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు నిరసనగా వామపక్షాల పార్టీలు, కార్మిక సంఘా ల ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరి గింది. బంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్ధతు తెలిపినట్లు తెలి పారు. ఉదయం 6 గంటల నుంచి వామపక్ష పార్టీల నాయకు లు పట్టణంలో దుకాణాలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల ను మూసివేయించారు.
ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రజల ఆస్తి అని, బీజేపీ ప్రభుత్వం ఆ ప్యాక్టరీని ప్రైవేటుపరం చేయడానికి చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన సంద ర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఇంతవరకు పట్టిం చుకోలేదని విమర్శించారు. జిల్లాలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తా మన్న హమీని కూడా విస్మరించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యదర్శి వంశీ, అ ధ్యక్షుడు గణేష్, డీవై ఎఫ్ఐ కార్యదర్శి జాఫర్‌సాధిక్, సీఐటీయూ నాయకులు తదిత రులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే ప్రత్యేక ఉద్యమం తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు మద్ధతుగా విద్యార్థి సంఘాలు విద్యాసంస్థలు బంద్ నిర్వహించాయి. ఈ కార్యక్రమం లో ఎఐఎస్ఎఫ్ లా స్టూడెంట్స్ వింగ్ కన్వీనర్ నాగ రాజు, పీడీఎస్‌వో జిల్లా కన్వీనర్ ఓబులేసు, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జమ్మలమడుగులో...
జమ్మలమడుగు రూరల్, మార్చి 5 : జమ్మలమడు గులో శుక్రవారం జరిగిన బంద్ విజయవంతమైంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపాలని, సె యిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని విద్యార్థి యువజన, ప్రజాసంఘాలు, డీ వైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు బంద్ నిర్వహించా రు. పట్టణంలో ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బస్సులు డిపోకు పరిమి తం అయ్యాయి. ప్రజాసంఘాల నాయకులు విద్యా సంస్థలు, ఎల్ఐసీ, ప్రభుత్వరంగ సంస్థలను మూసి వేయించారు. కార్యక్రమంలో జమ్మలమడుగు కన్వీనర్ ఓబులేసు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
ఆర్టీపీపీలో..
ఎర్రగుంట్ల, మార్చి 5 : ప్రభుత్వరంగ సంస్థల ను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకణ చేసేందుకు ప్ర యత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నా లు వెంటనే ఆపాలని ఆర్టీపీపీ మెయినగేటు ముందు అసోషియేషన్స డిమాండ్ చేశాయి. శుక్ర వారం ఉదయం 9గంటల నుంచి 10.30వరకు ధ ర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ క్కు అన్నారు. అలాగే విశాఖ ఉక్కును ప్రైవేటీ క రణకు నిరసనగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వ ర్యంలో విద్యాసంస్థలను మూయించారు. కార్యక్ర మంలో ఎం.నారాయణ, కృష్ణ, మల్లి, వరత అరు ణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కొండాపురంలో
కొండాపురం, మార్చి 5 : విశాఖ ఉక్కు ప్రైవే టీకరణను నిరసిస్తూ శుక్రవారం కొండాపు రంలో బంద్ నిర్వహించారు. సీపీఐ, ఏఐటీయూసీ, వై సీపీ ఆధ్వర్యంలో కొండాపురం కొత్త బైపాస్ రోడ్డు లో వాహనాలను ఆపి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మనో హర్‌బాబు, గిరి, చిన్న తదితరులు పాల్గొన్నారు.