అద్దంకిలో బంద్‌ ప్రశాంతం

Sep 27 2021 @ 23:41PM
అద్దంకిలో నామ్‌రోడ్డుపై రాస్తారోకో చేస్తున్న టీడీపీ, రైతు, ప్రజా సంఘాల నాయకులు

అద్దంకి , సెప్టెంబరు 27 :  అద్దంకిలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో నామ్‌రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగినేని రామకృష్ణ  ,సీపీఐ నాయకులు గొల్లపూడి వెంకటేశ్వర్లు, అన్నమనేని వెంకటరావు, సీపీఎం నాయకులు గంగయ్య, టీడీపీ నాయకులు చిన్ని శ్రీనివాసరావు, మన్నం త్రిమూర్తులు, మానం మురళీమోహన్‌దా్‌స,  వడ్డవల్లి పూర్ణచంద్రరావు, యర్రాకుల రామాంజనేయులు,  గుంజి శ్రీనివాసరావు,  కౌన్సిలర్‌ అంకం తేజశ్వని, కాసా పుల్లయ్య, నటరాజ్‌, గోపి పాల్గొన్నారు.

సంతమాగులూరులో..

సంతమాగులూరు : మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. పుట్టావారిపాలెం జంక్షన్‌లో రాస్తారోకో చేపట్టారు. సీపీఐ మండల కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడారు.    సీపీఐ మండల నాయకులు మేకల రమణయ్య, మొగిలి వెంకటేశ్వర్లు, అద్దంకి నాగేశ్వరరావు, యలమందయ్య, పి.రాము తదితరులు పాల్గొన్నారు. 

బల్లికురవలో.. 

బల్లికురవ : బంద్‌ సందర్భంగా బల్లికురవ నాలుగు రోడ్ల కూడలిలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు తాము పండించిన పంటలతో మానవహారం నిర్వహించారు.    సీపీఎం, సీపీఐ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, వల్లెపు నరసింహం, రైతు సంఘాల నేతలు దద్దాల అంజయ్య, బొంతా వీరయ్య పాల్గొన్నారు.

పంగులూరులో..  

పంగులూరు : మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలను రైతు సంఘాల నేతలు మూసివేయించారు. టీడీపీ నాయకులు ముప్పవరంలో బంద్‌  చేపట్టారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రావూరి రమేష్‌,  కె.వి. సుబ్బారావు, కుక్కపల్లి ఏడుకొండలు, వెంకట్రామిరెడ్డి, బ్రహ్మానందస్వామి, ఏసోబు, రవి,  రైతు సంఘం నాయకులు రాయిణి వినోద్‌, తలపనేని రామారావు, మేడా సుబ్బారావు, వీరనారాయణ పాల్గొన్నారు. 

మేదరమెట్లలో.. 

మేదరమెట్ల: బంద్‌ సందర్భంగా మేదరమెట్లలో మానవహారం నిర్వహించారు. కొరిశపాడుతోపాటు ఇతరపలు గ్రామాల్లో బంద్‌ పాటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార దుకాణాలు మూసివేశారు.  కార్యక్రమంలో టీడీపీ, సీపీఎం, సీపీఐతోపాటు వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు  పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.