స్వాతంత్య్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు బంద్‌

Published: Mon, 15 Aug 2022 04:31:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్వాతంత్య్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు బంద్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బిహార్‌ ప్రభుత్వ నిర్ణయం

పాట్నా, ఆగస్టు 14 : బిహార్‌లో ఇటీవల అధికారం చేపట్టిన మహాగఠ్బంధన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల్లో సోమవారం నిర్వహించ తలపెట్టిన సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. అయితే, ఆర్జేడీతో కలిసి ఇటీవల అధికారం చేపట్టిన నితీశ్‌ కుమార్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల క్రితం వరకు అధికారంలో ఉన్న జేడీయూ-బీజేపీ కూటమి హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు చేసింది. కానీ, తమతో బంధాన్ని తెంచుకున్న నితీశ్‌ ఇప్పుడు వాటిని రద్దు చేయడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జాతీయ జెండాను అవమానించడమేనని ఆ పార్టీ నేత అమిత్‌ మాల్వియ ట్వీట్‌ చేశారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.