విశాఖ ఉక్కు.. ప్రైవేటు వద్దు

ABN , First Publish Date - 2021-03-06T06:35:39+05:30 IST

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపులో భాగంగా శుక్రవారం తలపెట్టిన బంద్‌ జిల్లావ్యాప్తంగా విజయవంతమైంది.

విశాఖ ఉక్కు.. ప్రైవేటు వద్దు
ఏలూరు బస్టాండ్‌లో బంద్‌ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

బంద్‌ విజయవంతం.. మూతపడిన వ్యాపార, వాణిజ్య సంస్థలు

మధ్యాహ్నం వరకు తిరగని బస్సులు.. ధర్నాలు, ర్యాలీలతో ఆందోళనలు

ఏలూరు కార్పొరేషన్‌, మార్చి 5:విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపులో భాగంగా శుక్రవారం తలపెట్టిన బంద్‌ జిల్లావ్యాప్తంగా విజయవంతమైంది. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, కొవ్వూరు, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూ డెంతోపాటు అన్ని మండల కేంద్రాలు, ముఖ్య ప్రాంతాల్లో బంద్‌ పాటించారు. పలుచోట్ల ర్యాలీలు, నిరసనలు తెలిపారు. ఏలూరు నగరంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛం దంగానే మూసివేశారు. వీధులు, వ్యాపార సంస్థలు, కూడళ్ళు నిర్మానుష్యంగా కని పించాయి. ప్రజా సంఘాల నాయకులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ తగదంటూ నినాదాలు చేస్తూ జెండాలు, బ్యానర్లతో నగరంలో భారీ ప్రదర్శనలు నిర్వహిం చారు. ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యం లో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ప్రజా సంఘాలతోపాటు ఎన్జీవో సంఘం భాగస్వామ్యమైంది. వివిధ కూడళ్లల్లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షులు ఆర్‌.ఎస్‌.హరనాధ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు యు.వెంకటేశ్వరరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మాట్లా డుతూ త్యాగాలు, ఆత్మార్పణల ద్వారా సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవే టుపరం చేయడాన్ని తెలుగు ప్రజలు సహించరన్నారు. కేంద్రానికి కనువిప్పు కల గాలని, నేడు జరిగిన బంద్‌లో అన్నివర్గాల ప్రజలు పాల్గొని మనోభావాలను తెలియచేశారని, ఆంఽద్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయ వద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో తెలియజేస్తున్నారన్నారు. ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు, పీడీఎస్‌యు నాయకులు కె.నాని, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-06T06:35:39+05:30 IST