రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2021-03-06T05:12:12+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన

రాష్ట్రంలో రాక్షస పాలన
నర్సంపేటలో పట్టభద్రుల సదస్సులో మాట్లాడుతున్న బండి సంజయ్‌

టీఆర్‌ఎ్‌సపై ఎమ్మెల్సీ యుద్ధం ఆరంభించాం : బండి సంజయ్‌

నర్సంపేట, మార్చి 3 : టీఆర్‌ఎ్‌సను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని ఆ పార్టీ రా ష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. నర్సంపేటలోని రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పట్టభద్రుల సదస్సును నిర్వహించారు. సంజయ్‌ మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీల కోసం పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై లాఠీలు ఝుళిపించి జైల్లో పెట్టించారని, లాఠీలు, తూటాలకు కార్యకర్తలు భయపడరన్నారు. టీఆర్‌ఎ్‌సపై ఎమ్మెల్సీ యుద్ధాన్ని బీజేపీ ఆరంభించిందన్నారు. టీఆర్‌ఎ్‌సకు ఓటు వేస్తే పీఆర్సీ రాదని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి, ఉద్యోగ అవకాశాలు రావన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన, కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. 

అవినీతితో సంపాధించిన దానితో ఆ కుటుంబం జల్సాలు చేస్తోందని మండిపడ్డా రు. స్వచ్ఛ భారత్‌, హరితహారం, రైతువేదికలు, వైకుంఠధామాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలకు కేంద్రం నిధులు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. రూ.196 కోట్లు కేటాయిస్తే స్మార్ట్‌సిటీ జాడలేకుండా పోయిందన్నారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందుకే రాకుండా పోయిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని సంజయ్‌ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు జి.మోహన్‌రావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు శ్రుతి, వల్లాల శ్రీరాములు, రేసుశ్రీనివాస్‌, వడ్డెపెల్లి నర్సింహరాము లు, బాల్నుజగన్‌ తదితరులు పాల్గొన్నారు.

 ఫ ఖానాపురం: నర్సంపేటలో ఎన్నికల సదస్సుకు వెళ్తున్న బండి సంజయ్‌, అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మహబూబాబా ద్‌ జిల్లాలో ప్రచారం ముగించుకొని జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా మంగళవారిపేటలో రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళహారతులతో స్వాగతం పలికారు. బైక్‌ ర్యాలీతోపాటు సంజయ్‌ కాన్వాయ్‌ నర్సంపేటకు చేరుకుంది. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఎడ్ల అశోక్‌రెడ్డి, సంతో్‌షనాయక్‌,  మండల పార్టీ అధ్యక్షుడు ఆబోతు రాజుయాదవ్‌, యాకసాయన్న, రాజ్‌కుమార్‌, ఖాసీం, లక్‌పతి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-06T05:12:12+05:30 IST