జైలుకెళ్లడం కొత్తకాదు.. ధర్మయుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-01-07T20:36:14+05:30 IST

కేసీఆర్ పాలనను తరిమికొట్టేందుకు ధర్మయుద్ధం ప్రారంభమైందని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం...

జైలుకెళ్లడం కొత్తకాదు.. ధర్మయుద్ధం ప్రారంభమైంది: బండి సంజయ్

హైదరాబాద్: కేసీఆర్ పాలనను తరిమికొట్టేందుకు ధర్మయుద్ధం ప్రారంభమైందని, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరు కొనసాగిద్ధామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్‌కి వచ్చిన ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ తాము ఎవరికీ భయపడేది లేదని, జైలుకెళ్లడం కొత్త కాదన్నారు. జైలుకెళ్లడం ఇది తొమ్మిదోసారని అన్నారు. బీజేపీ నేత బోడిగ శోభపై అక్రమ కేసులు పెట్టడాన్ని  ఖండిస్తున్నానన్నారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయ ఉద్యోగుల కష్టాలు తనకు తెలుసునని అన్నారు. కేసులు, అరెస్టులను ముఖ్యమంత్రి నమ్ముకుంటే.. జైళ్ళను ఉద్యమాలకు అడ్డాగా మార్చుకుంటామని అన్నారు.


రామకృష్ట కుటుంబం ఆత్మహత్యపై సీఎం కేసీఆర్ స్పదించాలని, వనమా రాఘవకు ప్రజల‌ సమక్షంలో శిక్ష విధించాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రికి వస్తాసుపలుకుతున్న కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలను తరిమికొట్టాలన్నారు. రెండేళ్ళు ఓపిక పడితే ఉద్యోగులను వారి సొంత ఇంటికి పంపిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, తెలంగాణ బీజేపీ నేతలు డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల రాజేందర్, రాజసింగ్ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2022-01-07T20:36:14+05:30 IST