
హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభతో రాష్ట్రంలో చరిత్ర సృష్టిస్తామని బిజెపి రాష్ట్ర చీఫ్ బండిసంజయ్(bandi sanjay)అన్నారు. మోదీ సభకు కేసీఆర్ సర్కార్(kcr govt) అడ్డంకులు సృష్టిస్తోందని బండి సంజయ్ ఆరోపించారు.తెలంగాణపై బీజేపీ పాలసీని ప్రధాని ప్రకటించబోతున్నారని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన బండిసంజయ్ బీజేపీ కట్టడికి కేసీఆర్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు.తెలంగాణలో పేదలు జీవించలేని పరిస్థితిని కేసీఆర్ కల్పించారని అన్నారు.
ఇవి కూడా చదవండి