అదే జరిగితే తెలంగాణకు ఇద్దరు సీఎంలు ఉంటారు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-27T02:17:41+05:30 IST

ఏబీఎన్‌ అసోసియేట్ ఎడిటర్ వెంకట కృష్ణ ఇంటర్వ్యూలో బండి సంజయ్ ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. పాతబస్తీలో రోహింగ్యాలున్నారని...

అదే జరిగితే తెలంగాణకు ఇద్దరు సీఎంలు ఉంటారు: బండి సంజయ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ సీటు ఎంఐఎంకు వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉంటారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఏబీఎన్‌ అసోసియేట్ ఎడిటర్ వెంకట కృష్ణ ఇంటర్వ్యూలో బండి సంజయ్ ఎంఐఎంపై విరుచుకుపడ్డారు. పాతబస్తీలో రోహింగ్యాలున్నారని, ఎంఐఎంను పెంచి పోషించడం వల్లే రోహింగ్యాలు పెరిగారని ఆయన ఆరోపించారు. బీజేపీ విద్వేషాలు సృష్టిస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారని, రాజకీయ లబ్ధి పొందేందుకే కేసీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. టీఆర్ఎస్, ఎంఐఎం వేరు వేరంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతోందన్న ఆయన, బీజేపీ దిగజారే రాజకీయాలు చేయదని చెప్పుకొచ్చారు.


పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేయలేకపోతున్నారని, రాష్ట్రానికి ఒక న్యాయం.. పాతబస్తీకి ఒక న్యాయమా అని బండి సంజయ్ నిలదీశారు. ఎంఐఎం నేతలతో తమ పార్టీ నాయకులెవరికీ సంబంధం లేదని, ముమ్మాటికి ఎంఐఎం పార్టీ తమకు శత్రువేనని ఏబీఎన్‌ ఇంటర్వ్యూలో బండి సంజయ్ స్పష్టం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో వంద స్థానాలకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్, సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2020-11-27T02:17:41+05:30 IST