
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amithshah)ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) కలవడంలో తప్పేముందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ప్రశ్నించారు. ఈటల-అమిత్‌షా భేటీపై అపార్థాలు సరికాదన్నారు. జాతీయ నేతలను కలిసే స్వేచ్ఛ పార్టీలో అందరికీ ఉందన్నారు. కేసీఆర్(KCR) పార్టీ మాదిరి కాదని.. బీజేపీ(BJP)లో ఎవర్ని ఎవరైనా కలవొచ్చని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలనను గద్దెదించడమే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో దందాలన్నీ టీఆర్ఎస్(TRS) నేతలే చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కేసీఆర్(KCR) సర్కార్ విఫలమైందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. తెలంగాణలో నియంతపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం సాగిస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.