TS News: హర్ ఘర్ తిరంగా... ఘర్ ఘర్ తిరంగా అవ్వాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-08-09T18:24:37+05:30 IST

దేశవ్యాప్తంగా "హర్ ఘర్ తిరంగా" ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని బండి సంజయ్ అన్నారు.

TS News: హర్ ఘర్  తిరంగా... ఘర్ ఘర్ తిరంగా అవ్వాలి: బండి సంజయ్

యాదాద్రి (Yadadri): చౌటుప్పల్లో క్విట్ ఇండియా (Quit India) దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతమాత, మహాత్మా గాంధీ చిత్రపటాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna) పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా దేశవ్యాప్తంగా "హర్ ఘర్ తిరంగా" ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని "హర్ ఘర్ తిరంగా" ఘర్ ఘర్ తిరంగా అవ్వాలన్నారు. జాతీయ జెండా గొప్పదనాన్ని అందరికీ తెలియజేయాలని, ఈ నెల 13న ప్రజలందరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని పిలుపుచ్చారు. 14న ఆయా ప్రాంతంలో ఉన్న దేశ భక్తుల విగ్రహాలను శుభ్రపరచాలన్నారు. ఈ దేశాన్ని మూడు ముక్కలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఒక్క కుటుంబంతో స్వాతంత్ర్యం రాలేదని, ఎందరో మహనీయుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర్యంమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-09T18:24:37+05:30 IST