కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు వెళ్లారో చెప్పిన బండి సంజయ్

ABN , First Publish Date - 2021-01-24T23:11:18+05:30 IST

సీఎ కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్‌ను సీఎం చేయడానికి దోష నివారణ కోసమే కేసీఆర్‌ కాళేశ్వరం వెళ్లారని ఆయన తెలిపారు. తాము చెప్పింది వాస్తవం కాబట్టే...

కేసీఆర్ కాళేశ్వరం ఎందుకు వెళ్లారో చెప్పిన బండి సంజయ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయడానికి దోష నివారణ కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం వెళ్లారని ఆయన తెలిపారు. తాము చెప్పింది వాస్తవం కాబట్టే కేసీఆర్‌ ఖండించడం లేదన్నారు.  కేసీఆర్ వాస్తవాలు చెప్పాలని బండి సంజయ్ సూచించారు.  కేసీఆర్‌ నటనను ప్రజలు గుర్తించారని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాటకాలను తెలంగాణ ప్రజలు నమ్మరని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ అవాస్తమన్నారు. 


కాగా దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏ అవకాశం దొరికనా వదలడంలేదు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. బీజేపీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు కూడా ఇప ్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్ అయిన జానారెడ్డిపై ఫోకస్ పెట్టారు. అయితే ఆయన కాంగ్రెస్‌లో ఉంటానని చెప్పడంతో ఆయన అనుచర వర్గంపై దృష్టి పెట్టారు. తాజాగా జానా రెడ్డి కీలక అనుచరుడిని బీజేపీలో చేర్చుకునేందుకు రెడీ అయ్యారు. 


మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు టీఆర్ఎస్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే  ఆ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. సీఎం అంశం హాట్ టాపిక్‌గా  మారింది. ఇక  బీజేపీ నేతలు కూడా అదే విషయంపై విమర్శలు చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..  



Updated Date - 2021-01-24T23:11:18+05:30 IST