
హైదరాబాద్: బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ వెనక్కు తగ్గి వడ్లు కొంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అధికారం కోల్పోతున్న భయం కేసీఆర్‌కు పట్టుకుందని సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వమే ధాన్యం కొనడం రైతుల విజయమని ఆయన చెప్పారు. తాము రైతుల వెంటే ఉన్నామన్నారు.