ఉద్యమాన్ని చంపేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు: బండి శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-02-04T20:58:29+05:30 IST

అనమోలిస్ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని బండి శ్రీనివాసరావు అన్నారు.

ఉద్యమాన్ని చంపేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు: బండి శ్రీనివాసరావు

విజయవాడ: అనమోలిస్ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం స్టీరింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ వేతన సవరణలో ఒక సీనియర్ ఉద్యోగికి జూనియర్ కన్నా అన్యాయం జరిగితే దానిని పరిష్కరించడానికి ఈ కమిటీ పని చేస్తుందన్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని చంపేందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తోందన్నారు. ఇప్పుడు అనామలిస్ కమిటీ ఎక్కడుందో ఉద్యోగులు వెతుక్కోవాలా? అని ప్రశ్నించారు. వేతన గణన అనేది అర్ధం కాని బ్రహ్మ పదార్దంలా అధికారులు మార్చేశారన్నారు. ఈ విషయంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్‌కు పిచ్చి పట్టిందో... మాకు పట్టిందో అర్ధం కావడం లేదన్నారు. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను పక్కన పెట్టి అధికారుల కమిటీ నివేదిక అమలు చేసి ఉద్యోగులకు అన్యాయం చేశారన్నారు. ఓ వైపు అభ్యంతరాలు చెప్పుకునే సమయంలోనే ప్రభుత్వం చీకటి జీవోలు ఇచ్చిందని, అదే సమయంలో ఉద్యోగులను భయపెట్టేలా వైద్యారోగ్య శాఖలో బదిలీలు చేసేందుకు సిద్ధమయిందన్నారు. ప్రభుత్వ ఎత్తుగడలను ఉద్యోగులు, ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇదే తరహాలో వ్యవహారం చేస్తే ఎమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేస్తామని బండి శ్రీనివాసరావు హెచ్చరించారు.

Updated Date - 2022-02-04T20:58:29+05:30 IST