చర్చలు సఫలం అయ్యాయి: స్టీరింగ్ కమిటీ సభ్యులు

ABN , First Publish Date - 2022-02-06T20:21:44+05:30 IST

గత రెండు రోజులుగా మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్నారు.

చర్చలు సఫలం అయ్యాయి: స్టీరింగ్ కమిటీ సభ్యులు

అమరావతి: గత రెండు రోజులుగా మంత్రుల కమిటీతో జరిగిన చర్చలు సఫలం అయ్యాయని స్టీరింగ్ కమిటీ సభ్యులు అన్నారు.  ఆదివారం సీఎం జగన్‌ను ఉద్యోగ సంఘం నేతలు కలిసారు. అనంతరం బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ  ఉద్యోగులు ప్రభుత్వ కుటుంబంలోని భాగమని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి బాగో లేక పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయామని అన్నారన్నారు. ఇప్పుడు రూ. 11,500 కోట్ల అదనపు భారం పడుతోందని, ఉద్యోగులు కష్టపడి పని చేసి ప్రభుత్వంకు మంచి పేరు తేవాలని చెప్పారన్నారు. సామాన్య ఉద్యోగి, టీచర్స్ కోసం నాలుగు జేఏసీలు కలిసి పని చేసాయని, భవిష్యత్తులో కూడా ఈ పీఆర్సీ సాధన సమితి పని చేస్తుందని బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.


స్టీరింగ్ కమిటీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గతంలో సమ్మెలు చేయడం ద్వారా సాధించింది ఏమి లేదని అన్నారు. సమ్మె వల్ల గతంలో సాధించిన వాటికన్న అభ్యర్ధించినవి మాత్రమే కనిపిస్తాయన్నారు. ముఖ్యమంత్రికి ఉద్యోగుల పక్షాన క్షమాపణ చెపుతున్నామని వెంకట్రామిరెడ్డి అన్నారు.

Updated Date - 2022-02-06T20:21:44+05:30 IST