ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్‌కు నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన బండ్ల గణేష్..''కవితగారూ.. నేను జోకర్ని కాదు.. ఫైటర్ని. ప్రస్తుతం నేను ఎటువంటి రాజకీయాల్లో తలదూర్చాలని అనుకోవడం లేదు. మీకు ఆల్ ది బెస్ట్''... అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ కవిత ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఇన్‌డైరెక్ట్‌గా బండ్ల పంచ్ విసిరినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ కవిత.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో పాదయాత్ర చేస్తూ.. బండ్ల గణేష్‌పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ''గత ఎన్నికలకు ముందు బండ్ల గణేష్ అనే వ్యక్తి ప్రజలందరినీ కడుపుబ్బా నవ్విస్తే.. ప్రస్తుత ఎన్నికల్లో బండ్ల గణేష్‌ను మించి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనే వ్యక్తి కామెడీ చేస్తున్నారు. పూటకో మాట.. రోజుకో వేషం వేసి కమెడియన్‌గా మాట్లాడుతూ నగర ప్రజలను కామెడీతో నవ్విస్తున్నాడు.." అని కవిత చేసిన కామెంట్స్‌కు బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా పై విధంగా రియాక్ట్ అయ్యారు.