కేసీఆర్ నాయకత్వంలోనే డ్రగ్స్ దందా: బండి సంజయ్

ABN , First Publish Date - 2022-04-08T23:44:30+05:30 IST

హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారడానికి కారణం సీఎం కేసీఆర్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ నాయకత్వంలోనే డ్రగ్స్ దందా: బండి సంజయ్

హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారడానికి కారణం సీఎం కేసీఆర్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కారణంగానే పంజాబ్ ప్రభుత్వం కుప్పకూలిందని.. త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందన్నారు.  కేసీఆర్ కుటుంబ సభ్యుడికి రాష్ట్రంలో 112 వైన్స్ షాపులున్నాయన్నారు.డ్రగ్స్ కేసులో విచారణ చేసిన అధికారులను సైతం ఢిల్లీకి పంపారని.. విచారణ పేరుతో 2015 నుంచి ఏం సాధించారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం ఉన్నందునే.. ఈడీకి సహకరించలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. 


గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సిందే..

గవర్నర్ వ్యవస్థను ఏ ప్రభుత్వమైనా గౌరవించాల్సిందేనని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.గవర్నర్ తమకు ఏజెంట్‌గా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోందన్నారు. ప్రభుత్వం, గవర్నర్‌ వ్యవహారంలో బీజేపీ తలదూర్చదని చెప్పారు.డ్రగ్స్ ముఠాలను అరెస్ట్ చేయలేని వాడు దేశాన్ని బాగుచేస్తాడా?అని ప్రశ్నించారు. కేటీఆర్ మాటలను పట్టించుకునే వారే లేరని బండి సంజయ్ అన్నారు. 

Updated Date - 2022-04-08T23:44:30+05:30 IST