బెంగళూర్, ఇండోర్.. ఈ రెండు నగరాలే దేశంలో నెం.1

ABN , First Publish Date - 2021-03-04T22:04:07+05:30 IST

వీటితో పాటు అత్యుత్తమ పురపాలికల జాబితాను కూడా కేంద్ర మంత్రి విడుదల చేశారు. కాగా, ఈ జాబితాలో ఇండోర్ మున్సిపాలిటీ మొదటి స్థానం సంపాదించింది. క్లీన్ సిటీ అవార్డుతో పాటు పురపాలక రంగంలో పలు అవార్డులు సొంతం చేసుకున్న

బెంగళూర్, ఇండోర్.. ఈ రెండు నగరాలే దేశంలో నెం.1

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా బెంగళూరు నిలిచింది. తాజాగా దేశంలో నివాసయోగ్యమైన నగరాల జాబితాను పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి గురువారం విడుదల చేశారు. కాగా, ఈ జాబితాలో బెంగళూరు మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో పూణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కొయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై నగరాలు ఉన్నాయి. ఈ నగరాలన్నీ మిలియన్ జనాభా దాటిన నగరాల జాబితాలో చోటు సంపాదించినవి. అయితే మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల జాబితాను ప్రత్యేకంగా విడుదల చేశారు. ఈ జాబితాలో మొదటి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత భుబనేశ్వర్, సిల్వాస్సా, కాకినాడ, సేలం, వెల్లూర్, గాంధీనగర్, గురుగ్రాం, దావనగిరి, తిరుచిరపల్లి పట్టణాలు టాప్-10 స్థానాల్లో నిలిచాయి.


వీటితో పాటు అత్యుత్తమ పురపాలికల జాబితాను కూడా కేంద్ర మంత్రి విడుదల చేశారు. కాగా, ఈ జాబితాలో ఇండోర్ మున్సిపాలిటీ మొదటి స్థానం సంపాదించింది. క్లీన్ సిటీ అవార్డుతో పాటు పురపాలక రంగంలో పలు అవార్డులు సొంతం చేసుకున్న ఇండోర్.. తాజాగా విడుదల చేసిన జాబితాలో కూడా మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. ఇండోర్ తర్వాతి స్థానాల్లో సూరత్, భోపాల్, పింప్రీ చించ్వాడ్, పూణె, అహ్మదాబాద్, రాయ్‌పూర్, గ్రేటర్ ముంబై, విశాఖపట్నం, వడోదర నగర మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవన్నీ మిలియన్ జనాభా దాటిన నగర మున్సిపాలిటీల జాబితా. ఇక మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణ మున్సిపాలిటీల్లో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తిరుపతి, గాంధీనగర్, కర్నాల్, సేలం, తిరుప్పూర్, బిలాస్‌పూర్, ఉదయ్‌పూర్, ఝాన్సీ, తిరునెల్వేలి పట్టణాలు ఉన్నాయి.



Updated Date - 2021-03-04T22:04:07+05:30 IST