నిలిచేదెవరో?

ABN , First Publish Date - 2022-05-25T07:23:46+05:30 IST

అనూహ్య రీతిలో ప్లేఆఫ్స్‌ ఆఖరి బెర్త్‌ను దక్కించుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కఠిన సవాల్‌ ఎదురుకానుం ది.

నిలిచేదెవరో?

రా. 7.30 నుంచి

ఎలిమినేటర్‌లో బెంగళూరు-లఖ్‌నవూ పోరు నేడు

  కోల్‌కతా: అనూహ్య రీతిలో ప్లేఆఫ్స్‌ ఆఖరి బెర్త్‌ను దక్కించుకున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు కఠిన సవాల్‌ ఎదురుకానుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను ఢీకొననుంది. గతంతో పోల్చితే బెంగళూరు ఎంతో సమతుల్యమైన జట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా హాజెల్‌వుడ్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌లతో బౌలింగ్‌ విభాగం బలంగా ఉంది. టాపార్డర్‌లో విరాట్‌ టచ్‌లోకి రావడం పెద్ద సానుకూలాంశం కాగా.. ఫినిషర్‌గా దినేష్‌ కార్తీక్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మ్యాక్స్‌వెల్‌ స్థాయికి తగ్గ ఆటను ఇంకా ప్రదర్శించలేదు. 


ఓపెనర్లే బలం..:

మరోవైపు నిలకడైన ప్రదర్శనతో లఖ్‌నవూ ఆకట్టుకుంటోంది. యువ పేసర్లు అవేశ్‌ ఖాన్‌, మొహిసిన్‌ ఖాన్‌ జట్టుకు ప్రధాన బలంగా మారగా.. బ్యాటింగ్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ రాహుల్‌, డికాక్‌ మూలస్తంభాలుగా నిలుస్తున్నారు. క్రునాల్‌, స్టొయినిస్‌ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో స్టార్లతో ఉన్న బెంగళూరు బ్యాటింగ్‌ను కట్టడి చేయడంపైనే లఖ్‌నవూ విజయావకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అయితే, ఎలాగైనా ఈసారి టైటిల్‌ నెగ్గాలనే కసితో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌.. ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశాన్ని చేజారనివ్వకూడదనే సంకల్పంతో ఉంది.

Updated Date - 2022-05-25T07:23:46+05:30 IST