గాజులు, ఫ్యాన్సీ దుకాణం దగ్ధం

ABN , First Publish Date - 2022-05-17T04:40:43+05:30 IST

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో స్థానిక పంచాయతీ బస్టాండులో ఆదివారం రాత్రి గాజులు, ఫ్యాన్సీ దుకాణం దగ్ధమైంది.

గాజులు, ఫ్యాన్సీ దుకాణం దగ్ధం
దగ్ధమవుతున్న దుకాణం

సుమారు రూ.3లక్షల ఆస్తినష్టం

పొదలకూరు, మే 16 : విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగడంతో స్థానిక పంచాయతీ బస్టాండులో ఆదివారం రాత్రి గాజులు, ఫ్యాన్సీ దుకాణం దగ్ధమైంది.  స్థానికులు, బాధితురాలి వివరాల మేరకు పంచాయతీ బస్టాండులో రత్నమ్మ గాజులు, ఫ్యాన్సీ దుకాణంలో ఒక్కసారిగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన వచ్చి  మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3లక్షల విలువైన సామగ్రి  కాలిపోయినట్టు బాధితురాలు రత్నమ్మ, ఫైర్‌ సిబ్బంది తెలిపారు.

Updated Date - 2022-05-17T04:40:43+05:30 IST