నేపాల్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన బంగ్లాదేశ్

ABN , First Publish Date - 2021-05-10T00:50:58+05:30 IST

హిమాయలన్ కంట్రీ నేపాల్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన పొరుగుదేశం బంగ్లాదేశ్ ఆ దేశం

నేపాల్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన బంగ్లాదేశ్

ఢాకా: హిమాయలన్ కంట్రీ నేపాల్‌లో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన పొరుగుదేశం బంగ్లాదేశ్ ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. రేపటి (సోమవారం) నుంచే నిషేధం అమల్లోకి వస్తుందని బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏబీ) తెలిపింది. కొవిడ్ ముప్పును తగ్గించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది.


కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల ఒకటో తేదీన 38 దేశాలకు ప్రయాణాలపై ప్రత్యేక నిబంధనలు విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ దేశాలను ఎ, బి, సిలుగా విభజించింది. ఎ-గ్రూపులో ఉన్న దేశాకు రాకపోకలు పూర్తిగా నిలిపివేసింది. 

Updated Date - 2021-05-10T00:50:58+05:30 IST