నేర నియంత్రణకు ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2022-08-22T16:10:10+05:30 IST

నగరంలో విజిబుల్‌ పోలీసింగ్‌ను పెంచడం, నేర నియంత్రణ కోసం నగర సీపీ సీవీ ఆనంద్‌ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కార్‌ హెడ్‌క్వార్టర్స్‌

నేర నియంత్రణకు ప్రత్యేక కమిటీ

 వనరులు వినియోగంపై ఫోకస్‌

 బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పీఎస్‎లకు అదనపు పాట్రో కార్లు : సీపీ

హైదరాబాద్‌ సిటీ: నగరంలో విజిబుల్‌ పోలీసింగ్‌ను పెంచడం, నేర నియంత్రణ కోసం నగర సీపీ సీవీ ఆనంద్‌ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కార్‌ హెడ్‌క్వార్టర్స్‌ జాయింట్‌ సీపీ కార్తికేయ, సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజారావు భూపాల్‌, ఐటీసెల్‌ డీసీపీ సతీష్‌, ఎంటీ అదనపు డీసీపీ బుర్హాన్‌ అలీలతో ఈ కమిటీ ఏర్పాటైంది. శాఖలో ఉన్న వనరులను వినియోగించుకుంటూ పోలీస్‌ పాట్రోల్‌ సిస్టం, విజిబులిటీ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి తగిన సూచనలిస్తోంది. పాట్రోల్‌ కార్‌ సిస్టంతో పాటు డయల్‌ 100కి వస్తున్న కాల్స్‌ (గతేడాది గణాంకాల ఆధారంగా),  సాంకేతికత వినియోగం ఆధారంగా నేర నియంత్రణకోసం తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్‌ చేస్తున్నారు. నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉన్నందున ఆయా పీఎ్‌సలకు అదనపు పాట్రో కార్లు సమకూర్చాలని సీపీ ఆదేశాలిచ్చారు. 

Updated Date - 2022-08-22T16:10:10+05:30 IST