ఇలా చదివితే.. బ్యాంక్ కొలువు మీదే..!

ABN , First Publish Date - 2021-11-08T16:06:15+05:30 IST

ఐబీపీఎస్‌ తాజాగా జాతీయ బ్యాంకుల్లో వివిధ అధికారి స్థాయి పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిర్దిష్ట అర్హతలు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోటీ కూడా సదరు అర్హతలు ఉన్నవారి మధ్యే ఉంటుంది. కొద్దిగా స్మార్ట్‌గా కష్టపడితే మంచి వేతనంతో ఆఫీసర్‌గా స్థిరపడవచ్చు..

ఇలా చదివితే.. బ్యాంక్ కొలువు మీదే..!

బ్యాంక్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్స్‌

అర్హులు తక్కువ... పోటీ ఎక్కువ!


ఐబీపీఎస్‌ తాజాగా జాతీయ బ్యాంకుల్లో వివిధ అధికారి స్థాయి పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నిర్దిష్ట అర్హతలు ఉన్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోటీ కూడా సదరు అర్హతలు ఉన్నవారి మధ్యే ఉంటుంది. కొద్దిగా స్మార్ట్‌గా కష్టపడితే మంచి వేతనంతో ఆఫీసర్‌గా స్థిరపడవచ్చు.


ఐబిపిఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌లకు తోడు ఇంటర్వ్యూ ఉంటుంది. 


ప్రిలిమినరీ ఎగ్జామ్‌

ఎ)    లా ఆఫీసర్‌, రాజభాష అధికారి కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలో మూడు టెస్ట్‌లు ఉంటాయి. టెస్ట్‌ అఫ్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, బ్యాంకింగ్‌ పరిశ్రమకు ప్రత్యేక రిఫరెన్స్‌గా టెస్ట్‌ ఆఫ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ ఉంటాయి.  

బి) ఐటి ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌ అధికారి కోసం నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలోనూ మూడు టెస్ట్‌లు ఉంటాయి. టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, టెస్ట్‌ ఆఫ్‌ రీజనింగ్‌, టెస్ట్‌ ఆఫ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌. 

నోట్‌: ఏ పోస్టుకైనా మొత్తం 150 ప్రశ్నలు, 125 మార్కులు. ప్రతి టెస్ట్‌కి నిర్ణీత కాలవ్యవధి 40 నిమిషాలు. ప్రిలిమినరీలో సెక్షనల్‌ కటాఫ్‌ మార్కుల పద్ధతి ఉంది. ఐబిపిఎస్‌ నిర్ధారించిన కనీస కటాఫ్‌ మార్కులను బట్టి అభ్యర్థులను మెయిన్‌కు క్వాలిఫై చేస్తారు.


పరీక్ష స్వరూపం

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ 

ఇంగ్లిష్‌ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. 

40 నిమిషాల్లో ఆన్సర్‌ చెయ్యాలి. మార్కులు: 25

1)    రీడింగ్‌ కాంప్రహెన్షన్‌(ఇంగ్లిష్‌ పాసేజ్‌ చదువుకుని, దాని కింద ఉన్న ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి) చాలా పోటీ పరీక్షల్లో రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ఉంది. వేగంగా చదవటం, అంతే వేగంగా జవాబులు గుర్తించడం ఇందులో ముఖ్యం. ఇందుకోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్‌ చదవటం అలవాటు చేసుకోవాలి. 

(ఇప్పుడు ఇస్తున్న టాపిక్‌లు కూడా ఎడ్యుకేషన్‌, వ్యాపారం, ఎగుమతులు ్క్ష దిగుమతులు, రిజర్వేషన్స్‌, మొదలైన అంశాలపై ఉంటున్నాయి. సాధారణంగా ఇంగ్లీష్‌ న్యూస్‌ పేపర్లలో కనిపించే అంశాలే ఉంటున్నాయి). ఆ పాసేజ్‌ కింద సాధారణంగా ఆరు ప్రశ్నలు ఉంటున్నాయి.

2) ఒక ఇంగ్లీష్‌ వాక్యాన్ని, మధ్యలో బ్లాంక్‌ (ఖాళీ)తో ఇచ్చి, ఆ కింద ఉన్న పదంతో నింపటం, ఇందులోగల విధానం. ఆ పదం వెర్బ్‌  లేదంటే ప్రిపొజిషన్‌  కావ చ్చు. గ్రామర్‌కి సంబంధించిన అంశాలైనా కావచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి.

3) ఎనిమిది ఇంగ్లిష్‌ వాక్యాలను ఇచ్చి వాటిల్లో గల గ్రామర్‌ తప్పులను కనుగొనేవిగా ఉంటాయి

4)     ఒక  ఇంగ్లిష్‌ వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఇస్తారు. దీన్ని సరైన ఆర్డర్‌లో అరేంజ్‌ చేయాలి. ఇలాంటివి అయిదు వాక్యాలు ఉంటాయి. 

5) ఒక ఇంగ్లిష్‌ వాక్యాన్ని ఇచ్చి, దానిలో కొంత భాగాన్ని బోల్డ్‌గా ఇస్తారు. ఆ బోల్డ్‌గా ఇచ్చిన భాగాన్ని, ఆ ఇంగ్లిష్‌ వాక్యం కింద ఉన్న ఆప్షన్‌లలో, ఏది సరిగ్గా సరిపోతుందో  గుర్తించి, ఆన్సర్‌గా పెట్టాలి. కొన్ని సమయాల్లో ప్రశ్నలో ఇచ్చిన ఇంగ్లీష్‌ వాక్యమే బాగుంటే, అదే ఆన్సర్‌గా పెట్టాలి. ఇలా 5 ప్రశ్నలు  ఉంటాయి.


రీజనింగ్‌ టెస్ట్‌

రీజనింగ్‌ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. 

40  నిమిషాల్లో ఆన్సర్‌ చెయ్యాలి. మార్కులు: 50

సాధారణంగా బ్యాంకు ప్రిలిమ్స్‌ పరీక్షలో రీజనింగ్‌ ఎబిలిటీ టెస్ట్‌ ప్రధాన పాత్ర వహిస్తుంది. కొంచెం కష్టంగా కూడా ఉంటుంది.

1) తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు ఆన్సర్‌ చేయడం ఈ టెస్ట్‌లో ముఖ్యం.  ఎక్కువగా పజిల్స్‌ ఉంటున్నాయి. పజిల్స్‌ అంటే క్లిష్టమైనవి అనుకోకుండా రోజూ చూసే సంఘటనలుగా విశ్లేషించుకుంటే ఆన్సర్‌ చేయడం చాలా సులువు.

2) ఆ తరవాత inequalities, direction and distance, syllogism, coding-decoding, alphanumeric series రక్త సంబంధాలు, బంధుత్వాలు, మొదలైనవాటిని ప్రిలిమ్స్‌లో ఆన్సర్‌ చేయండి. వీటి కోసం ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాలి.

1) పజిల్స్‌: ఆఫీసర్‌ పదవులకు నిర్వహించే ప్రిలిమ్స్‌ పరీక్షలో ఒక పజిల్‌ ఇచ్చి దాని కింద 6 ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నలు అన్నీ డైరెక్ట్‌గా ఆన్సర్‌ చేయగల్గినవే. 

2) బంధుత్వాలు/ (రక్త సంబంధాలు): ఒక కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, చెల్లి, సోదరుడు, మనుమరాలు, వారి సంతానాన్ని ఒక చిన్న పేరాగ్రాఫ్‌ రూపంలో ఇస్తారు. దాని కింద ఇచ్చిన 2 లేక 3 ప్రశ్నలు బంధు త్వాన్ని గుర్తించేవిగా ఉంటాయి.

3) డైరెక్షన్స్‌: దిశలు గుర్తించటం. ఈ  అంశంపై 3 ప్రశ్నలు ఉంటాయి.

4) సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌: రెండు బెంచీల్లో 5 మంది చొప్పున ఎదురెదురుగా కూర్చున్నారు. ఈ అంశంపై 5 ప్రశ్నలు ఉంటాయి 

5) సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌: వృత్తాకార టేబుల్‌పై 8 మంది కూర్చున్నారు. ఎవరికి  ఎదురుగా ఎవరున్నారు, ఎవరి పక్కన ఎవరున్నారు చెప్పాలి. ఈ అంశంపై 3 ప్రశ్నలు ఉంటున్నాయి.

ఇవికాకుండా సాధారణ రీజనింగ్‌ ప్రశ్నలు అంటే అనాలజి, నెంబర్‌ సిరీస్‌, కోడింగ్‌,  డి కోడింగ్‌ వంటివి ఉంటాయి.


లా ఆఫీసర్‌ ,రాజభాష అధికారి కోసం మాత్రమే ప్రిలిమ్స్‌లో ఉన్న మూడో టెస్ట్‌

జనరల్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌(బ్యాంకింగ్‌ పరిశ్రమ ప్రత్యేక రిఫరెన్స్‌తో) జనరల్‌ అవేర్‌నెస్‌ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. 40 నిమిషాల్లో ఆన్సర్‌ చెయ్యాలి. కేటాయించిన మార్కులు: 50

ఇందుకోసం అభ్యర్థులు రోజూ న్యూస్‌ పేపర్‌ చదవాలి. ఆరు నెలలుగా వార్తల్లో ఉన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. బ్యాంకింగ్‌ పదాలు, వార్తలను  ప్రత్యేకించి అధ్యయనం చేయాలి.


ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌లో ఐటి ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌  అధికారి కోసం మాత్రమే ప్రిలిమ్స్‌లో ఉన్న మూడో టెస్ట్‌: 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో 50 ప్రశ్నలు ఇస్తారు. 40  నిమిషాల్లో ఆన్సర్‌ చేయాలి. కేటాయించిన మార్కులు: 50

స్టెప్‌ 1: ముందుగా  ఈ కింది వాటిని ప్రాక్టీసు చేయండి. ప్రిలిమ్స్‌ పరీక్షలో మొదట వీటిని ఆన్సర్‌ చేయండి. సమయం తక్కువ తీసుకుంటుంది.

Quadratic Equations, Simplification, and Approximation, and Number Series 

స్టెప్‌ 2: ఆ తరవాత డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కి సంబంధించిన ప్రశ్నలు ఆన్సర్‌ చేయండి. అందుకోసం ఇప్పటి నుంచి ఇంటిదగ్గర వాటిని ప్రాక్టీసు చేయండి. ఈ టాపిక్‌ మీద 5 ప్రశ్నలు ఉంటున్నాయి. 

స్టెప్‌ 3: సాధారణ వడ్డీ, చక్రవడ్డీ, కాలము పని,  పైప్స్‌, పార్టనర్‌షిప్‌ మొదలైనవి ప్రిలిమ్స్‌లో చేయండి. అందుకోసం ఇప్పటి నుంచి ఇంటిదగ్గర వాటిని ప్రాక్టీసు చేయండి.

నెంబర్‌ సీరీస్‌: ఈ అంశంపై 5 ప్రశ్నలు ఉంటున్నాయి.

డేటా ఇంటర్‌ప్రిటేషన్‌: ఈ అంశంపై గతంలో ఈ కింది విధంగా ప్రశ్నలు ఉన్నాయి 

1) ఒకసారి లైన్‌ డయాగ్రం డేటాని టేబుల్‌ రూపంలో ఇచ్చారు. 

2) ఒకసారి బార్‌ చార్ట్‌ ఇచ్చారు. డేటాని  టేబుల్‌ రూపంలో  ఇచ్చారు .

3) ఒకసారి ‘ఫై డయాగ్రం’ ఇచ్చారు. (ప్రశ్నలు తగ్గాయి కానీ, ఇచ్చిన డేటాను నిష్పత్తిలోకి మార్చటం, శాతంలో చెప్పటం వంటివి ఉంటున్నాయి)

పదో తరగతిలో నేర్చుకున్న స్టాటిస్టిక్స్‌ మీద పట్టు ఉన్న వారు దీన్ని బాగా ఆన్సర్‌ చెయ్యచ్చు.


మెయిన్‌ ఎగ్జామ్‌

ఎ) రాజభాష అధికారి:

వీరి కోసం నిర్వహించే మెయిన్స్‌  పరీక్షలో రెండు  టెస్ట్‌లు ఉంటాయి. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌(వృత్తికి సంబంధించిన  పరిజ్ఞానం) ఆబ్జెక్టివ్‌ తరహలో ఒక టెస్ట్‌ ఉంటుంది. ఇందులో45 ప్రశ్నలు ఉంటాయి. దీనికి సమయం 30 నిమిషాలు. 

రెండోటెస్ట్‌లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (వృత్తికి సంబంధించిన  పరిజ్ఞానం) పైవర్ణనాత్మక/వ్యాస  తరహలో మరొక టెస్ట్‌ ఉంటుంది. ఇందులో 2 ప్రశ్నలు ఉంటాయి. దీనికి సమయం 30 నిమిషాలు. రెండు టెస్ట్‌లకు కలిపి మొత్తం మార్కులు 60.

బి) లా ఆఫీసర్‌, ఐటి ఆఫీసర్‌, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌, మార్కెటింగ్‌  అధికారి: వీరి నిర్వహించే మెయిన్స్‌  పరీక్షలో ఒకే  టెస్ట్‌  ఉంటుంది. ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ (వృత్తికి సంబంధించిన  పరిజ్ఞానం)పై  ఒక టెస్ట్‌ ఉంటుంది. ఇందులో 60 ప్రశ్నలు ఉంటాయి. కేటాయించిన మార్కులు 60. దీనికి సమయం 45 నిమిషాలు సమాధానాలను తప్పుగా గుర్తిస్తే నిర్దేశిత మార్కులో నాలుగో వంతు కట్‌ చేస్తారు.


పోస్ట్‌ ఖాళీలు

ఐటి ఆఫీసర్‌ (స్కేల్‌-1) - 220

అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) - 884

రాజభాష అధికారి (స్కేల్‌-1) - 84

లా ఆఫీసర్‌ (స్కేల్‌-1) - 44

హెచ్‌ఆర్‌/ పర్సనల్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) - 61

మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌-1) - 535


ఖాళీలున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.


అర్హతలు: పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 2021 నవంబరు 23 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక: ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, మిగిలిన అందరికీ రూ.850


ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 23

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబరు 26

ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష తేదీ: 2022 జనవరి 30

ఇంటర్వ్యూలు: 2022 ఫిబ్రవరి/మార్చి

వెబ్‌సైట్‌: https://www.ibps.in/


ప్రిలిమ్స్‌కి పరీక్ష సెంటర్‌లు: 

తెలంగాణలో: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌

ఆంధ్రప్రదేశ్‌లో: చీరాల, చిత్తూరు గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం


మెయిన్‌కి పరీక్ష సెంటర్‌లు: 

తెలంగాణలో:  హైదరాబాద్‌ 

ఆంధ్రప్రదేశ్‌లో: విజయవాడ, విశాఖపట్నం


Updated Date - 2021-11-08T16:06:15+05:30 IST