
ఇటీవల ఒక హైఫై ముఠా బ్యాంకు లోన్ ఇప్పిస్తామంటూ చాలామంది సామాన్యుల వద్ద లక్షల రూపాయలు దోచుకుంది. ఈ దోపిడీలు ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు యూపీ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి చాలా చాకచక్యంగా ఆ మోసగాళ్లను పట్టుకున్నారు. ఆ నేరస్తులను విచారణ చేయగా.. వారు దోపిడీ చేసే విధానం తెలుసుకొని పోలీసులకే షాకయ్యారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో ఒక దోపిడీ ముఠా సినీ ఫక్కీలో సామాన్యుల వద్ద బ్యాంకు లోను పేరుతో లక్షలు దోచుకున్నారు. ఆ మోసగాళ్లు ఒక పక్కా పథకం ప్రకారం దోపిడీలో చేశారు. వారంతా ఒక బృందంగా ఏర్పడి తాము బ్యాంకు ఉద్యోగులమంటూ బాధితులకు పరిచయమయ్యారు. పెద్ద ఆఫీసర్లుగా బట్టలు వేసుకొని ఒక కారులో వచ్చేవారు. పెద్ద మొత్తంలో బ్యాంకులో లోన్ కావాలంటే సహాయం చేస్తామని బుకాయించేవారు.
లోన్ కావాలంటే కొన్ని నిబంధనలున్నాయని చెప్పారు. ముందుగా బాధితుల బ్యాంకు ఖాతాలో ఎంత నగదు జమ ఉందో తెలుసుకునేవారు. ఎంత మొత్తంలో లోన్ కావాలో అంతే డబ్బు బ్యాంకు ఖాతాలో ముందుగానే ఉండాలని సూచించేవారు. ఆ తరువాత బాధితుల వద్ద ఒక క్యాన్సెల్ చేసిన చెక్ తీసుకొనేవారు. అయితే ఆ కేటుగాళ్ల ఇక్కడ ఒక కిటుకు చేసేవారు. ఆ చెక్ క్యాన్సెల్ చేసేందుకు వారు తమ వద్ద ఉన్న పెన్నుని బాధితులకు ఇచ్చేవారు. ఆ పెన్ను ఒక ఫ్రిక్సియన్ పెన్.. ఆ పెన్‌తో రాసిన రాత, గీసిన గీతలు కొన్ని గంటల తరువాత మయం అయిపోతాయి. దీంతో ఆ చెక్కు చెల్లుబాటుఅవుతుంది.
ఆ మోసగాళ్లు ఆ చెక్కుని తమ పేరు మీద బ్యాంకు జమ చేసుకొని డబ్బు దోచుకునేవారు. బాధితుల ఫోన్‌కు డబ్బు విత్ డ్రా అయినట్టు మెసేజ్ వచ్చినా.. వారికి అదంతా లోన్ ప్రక్రియలో ఒక భాగమంటూ చెప్పేవారు. చివరకు డబ్బుతీసుకొని పరారయ్యేవారు. చివరకు తాము మోసపోయామంటూ తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఆశ్రయించారు.
ఇలాంటి కేసులు గత కొంత కాలంగా ఎక్కువగా నమోదుకావడంతో.. పోలీసుల ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితుల చెక్కులను ఏ బ్యాంకు నుంచి విత్ డ్రా చేశారో అక్కడి సీసీటీవి వీడియోల ఆధారంగా మోసగాళ్లను గుర్తించారు. చివరికి వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ దొంగల వద్ద 9 మొబైల్ ఫోన్లు, ఒక కారు, ఒక లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి