బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు పోయాయంటూ కస్టమర్ ఫిర్యాదు.. దుండగుడి గురించి తెలిసి పోలీసులకే షాక్!

ABN , First Publish Date - 2022-02-10T09:38:00+05:30 IST

సాధారణంగా డబ్బులు బ్యాంకులో ఉంటే చాలా సేఫ్(సురక్షితం)గా ఫీలవుతాం. కానీ బ్యాంకు నుంచి కూడా డబ్బులు పోతే.. ఇక అంతే సంగతలు. అలాంటి ఒక ఘటనలో ఒక ఖాతాదారుడి అకౌంట్ నుంచి ముందు రూ.50,000 దొంగతనం అయ్యాయి. ఇది ఎలా జరిగిందని తెలుసుకునే లోపే మరో రూ.4,48,000 మాయమయ్యాయి. అసలేం జరుగుతుందో తెలియక బాధితుడు...

బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు పోయాయంటూ కస్టమర్ ఫిర్యాదు.. దుండగుడి గురించి తెలిసి పోలీసులకే షాక్!

సాధారణంగా డబ్బులు బ్యాంకులో ఉంటే చాలా సేఫ్(సురక్షితం)గా ఫీలవుతాం. కానీ బ్యాంకు నుంచి కూడా డబ్బులు పోతే.. ఇక అంతే సంగతలు. అలాంటి ఒక ఘటనలో ఒక ఖాతాదారుడి  అకౌంట్ నుంచి ముందు రూ.50,000 దొంగతనం అయ్యాయి. ఇది ఎలా జరిగిందని తెలుసుకునే లోపే మరో రూ.4,48,000 మాయమయ్యాయి. అసలేం జరుగుతుందో తెలియక బాధితుడు పోలీసుకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఆ డబ్బులు కాజేసిన మాస్టర్ మైంద్ ఎవరో తెలిసి అందరూ షాకయ్యారు. 


వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పట్నా సమీపంలోని మొకామా పట్టణంలో యాక్సిస్ బ్యాంక్ శాఖలో రామ్ ప్రవేశ్ కుమార్ అనే వ్యక్తి అకౌంట్‌లో నుంచి ఇటీవల రూ.50,000 పోయాయి. దీంతో రామ్ ప్రవేశ్ కుమార్ బ్యాంకులో వెళ్లి ఎలా జరిగిందని ఆరా తీశాడు. కానీ అతనికి మరో షాకింగ్ విషయం తెలిసింది. తన అకౌంట్‌కు సంబంధించి ఎవరో రూ.4,48,000 లోన్ తీసుకున్నారని. ఇది విన్న రామ్ ప్రవేశ్ కుమార్ తన అకౌంట్‌ని ఎవరో హ్యాక్ చేశారని భావించాడు. బ్యాంకు యజమాన్యానికి ఫిర్యదు చేసినా ఎటువంటి ఫలితం కనబడలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.


దాదాపు రూ.5 లక్షల చోరీ కేసులో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ముందుగా దొంగతనం అయిన రూ.50,000 గురించి పోలీసుల ట్రాక్ చేయగా.. ఆ డబ్బులు ఒక ఏటియం నుంచి ఎవరో తీసినట్లు తెలిసింది. కానీ బాధితుడి వద్దే డెబిట్ కార్డు ఉండగా.. డబ్బులు ఎవరు విత్ డ్రా చేశారని దర్యాప్తు చేశారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. 


బ్యాంకు నుంచి రామ్ ప్రవేశ్ కుమార్ అకౌంట్‌కు సంబంధించి ఎవరో డెబిట్ కార్డు పోయిందంటూ రిక్వెస్ట్ ఫాం ఇచ్చారు. అందులో మొబైల్ నెంబర్ కూడా మార్చాలని అప్లికేషన్‌లో ఉంది. అలా రామ్ ప్రవేశ్ కుమార్ అకౌంట్‌కు లింక్ ఉన్న అతని మొబైల్ నెంబర్ తొలగించి కొత్త మొబైల్ నెంబర్ జోడించారు. పైగా కొత్త డెబిట్ కార్డు కూడా జారీ చేశారు. అలా ఎటియం నుంచి రూ.50,000 తీసినా అప్పటికప్పుడు రామ్ ప్రవేశ్ కుమార్‌కు సమాచారం అందలేదు.


ఆ కొత్త మొబైల్ నెంబర్ ఎవరిదని పోలీసులు ట్రాక్ చేయగా.. అది బ్యాంకు అసిస్టెంట్ మెనేజర్ మొహమ్మర్ హసనైన్ భార్యదని తేలింది. దీంతో పోలీసులు బ్యాంకు అసిస్టెంట్ మెనేజర్‌ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అప్పుడు అతను పోలీసుల విచారణలో తానే డబ్బు చోరీ చేసినట్టు అంగీకరిచాడు. మిగతా రూ.4,48,000ల లోన్ కూడా తానే దొంగతనంగా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు.


పోలీసులు నిందితుడు బ్యాంకు అసిస్టెంట్ మెనేజర్ మొహమ్మద్ హసనైన్‌పై చీటింగ్, ఫ్రాడ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-10T09:38:00+05:30 IST